ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన అనాహత్‌.. 21 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు

Published on Sat, 07/25/2026 - 13:28

ప్రపంచ స్క్వాష్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ అనాహత్‌ సింగ్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. శ‌నివారం జ‌రిగిన సెమీఫైనల్లో అనాహ‌త్ 3-1 (11-3, 8-11, 11-4, 11-6) తేడాతో మూడో సీడ్‌ బార్బ్‌ సమెహ్‌ (ఈజిప్ట్)పై విజ‌యాన్ని అందుకుంది. త‌ద్వారా 21 ఏళ్ల త‌ర్వాత ప్ర‌పంచ స్క్వాష్ జూనియ‌ర్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ చేరిన రెండో క్రీడాకారిణిగా అనాహ‌త్ సింగ్ రికార్డుల‌కెక్కింది. 

2005లో జోష్నా చినప్ప ఈ టోర్నీలో ఫైన‌ల్ చేరిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. ఫైన‌ల్ బెర్తు ఖ‌రారు చేసుకున్న అనాహ‌త్ ప్ర‌పంచ స్క్వాష్ చాంపియ‌న్‌షిప్‌లో వరుసగా రెండో ఏడాది కూడా పతకాన్ని ఖరారు చేసుకుంది. తద్వారా ఈ చాంపియన్‌షిప్‌ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ స్క్వాష్‌ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్ప‌నుంది. 

గతేడాది కైరోలో జరిగిన ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో అనాహత్‌ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్యాన్ని సాధించింది. మ్యాచ్ విష‌యానికొస్తే నాలుగు గేమ్‌ల పాటు జ‌రిగిన మ్యాచ్‌లో అనాహ‌త్ తొలి గేమ్‌ను 11-3తో గెలుచుకోగా, రెండో గేమ్‌ను మాత్రం ప్ర‌త్య‌ర్థికి కోల్పోయింది. అయితే ఆ త‌ర్వాత వ‌రుస‌గా మూడు, నాలుగు గేముల్లో విజృంభించిన అనాహ‌త్ గేమ్‌ల‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవ‌సం చేసుకుంది. 

మ్యాచ్ విజ‌యం అనంత‌రం అనాహ‌త్ మాట్లాడుతూ.. ‘ఈ ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల చాలా సంతోషంగా ఉన్నా. బ్రిటీష్ జూనియ‌ర్ ఓపెన్‌లో ఇదే బార్బ్‌ను ఎదుర్కొన్నా, అప్పుడు ప‌రిస్థితులు నాకు క‌ఠినంగా ఉన్నాయి. కానీ ఈసారి ఆ త‌ప్పిదం చేయ‌కూడ‌ద‌ని మొద‌టి నుంచి గెలుపు కోస‌మే ప్ర‌య‌త్నించాను. 

అయితే క్వార్ట‌ర్స్‌లో న‌మోదు చేసిన ప్ర‌ద‌ర్శ‌నను ఇక్కడ పున‌రావృతం చేయ‌డంలో విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ సెమీస్‌లో విజ‌యం నాకు సంతృప్తినిచ్చింది. ఫైన‌ల్లో అడుగుపెట్ట‌డం ద్వారా నా త‌ల్లిదండ్రుల‌ను, కోచ్‌ల‌ను హ్యాపీ చేయ‌గ‌లిగాను. కానీ ఫైన‌ల్ గెలిస్తేనే నాకు ముగింపు’ అని చెప్పుకొచ్చింది.

 

Read: రెండో టీ20కి భారత తుదిజ‌ట్టు అంచ‌నా.. అతడిపై వేటు!

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)