Breaking News

టీమిండియాకు భారీ షాక్‌.. విండీస్ జట్టులోకి విధ్వంసకర వీరుడు

Published on Mon, 10/05/2026 - 11:08

టీమిండియాతో టీ20 సిరీస్‌‌కు ముందు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అమీర్ జంగూను టీ20 జట్టులోకి తీసుకుంది. చంఢీఘడ్ వన్డేలో గాయపడిన యువ బ్యాటర్ జ్యువెల్ ఆండ్రూకు బ్యాకప్‌గా జంగూను ఎంపిక చేశారు. 

చండీగఢ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా యువ బ్యాటర్ జ్యువెల్ ఆండ్రూ చేతి వేలికి తీవ్ర గాయమైంది. గాయం కారణంగా అతడు ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు కూడా రాలేకపోయాడు. ఆండ్రూ గాయం తీవ్రత దృష్ట్యా అతడు టీ20 సిరీస్‌ నుంచి తప్పుకునే అవకాశాలు ఉండడంతో జంగూకు చోటిచ్చారు.

వన్డే సిరీస్‌లో జంగూ విధ్వంసం
టీమిండియాతో వన్డే సిరీస్‌లో జంగూ దుమ్ములేపాడు. ఆడిన 3 ఇన్నింగ్స్‌ల్లో 119.50 సగటుతో, 135.80 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 239 పరుగులు సాధించాడు. తొలి వన్డేలో మెరుపు హాఫ్ సెంచరీ సాధించిన జంగూ.. గువాహటి వన్డేలో అద్భుత సెంచరీతో చెలరేగాడు. చివరి వన్డేలో అర్ధ శతకంతో మెరిశాడు. ఇప్పుడు భీకర ఫామ్‌లో ఉన్న జంగూ టీ20 జట్టులో రావడంతో మరోసారి భారత బౌలర్లకు కఠిన సవాల్ ఎదురుకానుంది.

టీ20 కెరీర్ ట్రాక్ రికార్డ్
2025 సెప్టెంబర్ 27న నేపాల్‌పై అరంగేట్రం చేసిన జంగూ.. ఇప్పటివరకు వెస్టిండీస్ తరఫున 7 టీ20లు ఆడి 163 పరుగులు చేశాడు. మొత్తంగా 34 టీ20 మ్యాచ్‌ల్లో 710 పరుగులు సాధించిన జంగూ.. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌-2026 విజతగా  యాంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ నిలవడంలో కూడా కీలక పాత్ర పోషించాడు.  9 మ్యాచ్‌ల్లో 213 పరుగులు చేసి రాణించాడు. ఇక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ అక్టోబర్ 6న లక్నో వేదికగా జరగనుంది.
చదవండి: జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా పృథ్వీ షా
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)