నిప్పులు చెరిగిన సిరాజ్‌.. భయపడిన బ్యాటర్లు

Published on Tue, 01/06/2026 - 18:37

విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో హైదరాబాద్ రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం రాజ్‌కోట్ వేదికగా బెంగాల్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 107 ప‌రుగుల తేడాతో హైద‌రాబాద్ విజ‌య భేరి మ్రోగించింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది.

యువ ఓపెనర్ అమన్ రావు అద్భుతమైన డబుల్ సెంచరీతో చెల‌రేగాడు. కేవలం 154 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్సర్లతో 200 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అత‌డితో పాటు గహ్లాట్ రాహుల్ సింగ్(65), కెప్టెన్ తిలక్ వర్మ (34) రాణించారు. బెంగాల్ బౌలర్లలో మహమ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టాడు.

నిప్పులు చెరిగిన సిరాజ్‌..
అనంత‌రం 353 ప‌రుగుల భారీ ల‌క్ష్య  చేధ‌న‌లో బెంగాల్ జ‌ట్టు 44.4 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. బెంగాల్ బ్యాట‌ర్ల‌లో షాబాజ్ అహ్మద్ ఒంటరి పోరాటం చేశాడు. షాబాజ్113 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సన్నాహకంగా ఈ టోర్నీ ఆడుతున్న హైదరాబాదీ స్పీడ్ స్టార్ మహ్మద్ సిరాజ్.. ఈ మ్యాచ్‌లో నిప్పులు చెరిగాడు.

సిరాజ్ మియా తన 10 ఓవర్ల కోటాలో 58 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు నితేష్ రెడ్డి రెండు, సీవీ మిలంద్‌, రక్షణ్‌, నితిన్ తలా వికెట్ సాధించారు. కాగా హైదరాబాద్ ప్రస్తుతం గ్రూపు-బి పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో ఉంది. హైదరాబాద్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ భారీ విజయాన్ని అందుకోవాలి. అంతేకాకుండా మిగితా జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
చదవండి: ఐపీఎల్ నుంచి ఔట్‌.. ముస్తాఫిజుర్‌కు పరిహారం అందుతుందా?

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)