10 ఓవ‌ర్ల‌లో 123 పరుగులు.. సీఎస్‌కే బౌల‌ర్ అత్యంత చెత్త రికార్డు

Published on Tue, 12/30/2025 - 08:42

దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో పుదుచ్చేరి కెప్టెన్, ఆల్‌రౌండర్‌ అమాన్‌ ఖాన్‌ కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అయితే ఇది దురదృష్టవశాత్తూ చెప్పుకోవడానికి ఇష్టపడని అవమానకరమైన రికార్డు కావడం గమనార్హం. జార్ఖండ్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అమాన్‌ 10 ఓవర్లలో ఏకంగా 123 పరుగులు సమర్పించుకున్నాడు. 

దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు కలిపి (లిస్ట్‌–ఎ క్రికెట్‌)లో ఒక మ్యాచ్‌లో బౌలర్‌ ఇచ్చిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. ఇదే టోర్నీలో ఈ నెల 24న బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌ బౌలర్‌ మిబోమ్‌ మోసూ 9 ఓవర్లల ఇచ్చిన 116 పరుగుల రికార్డు ఇప్పుడు తెరమరుగైంది.

ఐపీఎల్‌లో రెండు సీజన్ల పాటు కోల్‌కతా, ఢిల్లీ జట్లకు కలిపి 12 మ్యాచ్‌లలో ఆడినా ఒకే ఒక ఓవర్‌ బౌలింగ్‌ చేసే అవకాశం వచ్చిన అమాన్‌ ఖాన్‌ ఇటీవల జరిగిన 2026 వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ.40 లక్షలకు సొంతం చేసుకుంది. పుదుచ్చేరితో మ్యాచ్‌లో 50 ఓవర్లలో 7 వికెట్లకు 368 పరుగులు చేసిన జార్ఖండ్‌...ఆ తర్వాత పుదుచ్చేరిని 235 పరుగులకే ఆలౌట్‌ చేసి 133 పరుగులతో విజయాన్నందుకుంది.
చదవండి: ఇంగ్లండ్‌, పాక్‌ కాదు.. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్‌ చేరే జ‌ట్లు ఇవే!  

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)