Breaking News

ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఎవ‌రూ ఊహించ‌ని ప్లేయ‌ర్‌..

Published on Tue, 11/04/2025 - 19:28

హాంగ్‌కాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 టోర్నమెంట్ నవంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఏడుగురు సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ జట్టు కెప్టెన్‌గా బిగ్ బాష్ లెజెండ్ అలెక్స్ రాస్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో బెన్ మెక్‌డెర్మాట్, ఆండ్రూ టై, క్రిస్ గ్రీన్ వంటి అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు సైతం ఉన్నారు.

క్రిస్ గ్రీన్‌కు కెప్టెన్‌గా అపారమైన అనుభవం ఉనప్పటికి రాస్‌కే జట్టు పగ్గాలను సెలక్టర్లు కట్టబెట్టారు. గ‌తేడాది ఆస్ట్రేలియా సెమీఫైన‌ల్లో పాక్ చేతిలో ఓట‌మి పాలైంది. దీంతో ఈసారి ఎలాగైనా క‌ప్ కొట్టాల‌ని కంగారులు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. కాగా ఈవెంట్‌లో మొత్తం  12 జట్లు పాల్గొననున్నాయి. 

ఆస్ట్రేలియా, భారత్‌, పాకిస్తాన్‌, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, హాంకాంగ్, నేపాల్, ఒమన్, యూఏఈ జట్లు భాగం కానున్నాయి.  నవంబర్ 7 నుంచి 9 వ‌ర‌కు టిన్ క్వాంగ్ రోడ్ రిక్రియేషన్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ సిక్సెస్ టోర్నీ కోసం భార‌త జ‌ట్టును ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. టీమిండియా కెప్టెన్ దినేష్ కార్తీక్  వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

హాంకాంగ్ క్రికెట్ సిక్సర్స్ కోసం ఆస్ట్రేలియా జట్టు:
అలెక్స్ రాస్ (కెప్టెన్), బెన్ మెక్‌డెర్మాట్, జాక్ వుడ్, నిక్ హాబ్సన్, క్రిస్ గ్రీన్, విలియం బోసిస్టో , ఆండ్రూ టై.

అసలేంటి హాంకాంగ్ సిక్సెస్‌?
1992లో హాంకాంగ్ క్రికెట్ ఆధ్వ‌ర్యంలో మొద‌లైన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ.. చివ‌ర‌గా 2017 వ‌ర‌కు జ‌రిగింది. ఆ త‌ర్వాత కొన్ని కార‌ణాల‌తో ఈ టోర్నీని నిర్వ‌హించ‌లేదు.  అయితే ఈ ఈవెంట్‌కు మ‌ళ్లీ  పూర్వ వైభవాన్ని తీసుకువ‌చ్చేందుకు హాంకాంగ్ క్రికెట్ ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఏడేళ్ల త‌ర్వాత ఈ టోర్నీని మ‌ళ్లీ నిర్వ‌హించారు. గ‌త సీజ‌న్ విజేత‌గా శ్రీలంక నిలిచింది.

ద‌క్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జ‌ట్లు అత్య‌ధికంగా 5 సార్లు ఈ టోర్నమెంట్ విజేత‌ల‌గా నిల‌వ‌గా.. పాకిస్తాన్ 4 సార్లు, శ్రీలంక రెండు సార్లు ఈ హాంకాంగ్ సిక్సెస్ ట్రోఫీని ముద్దాడింది. భార‌త్‌, ఆస్ట్రేలియా, విండీస్ జ‌ట్లు చెరో ఒక్క‌సారి ఛాంపియ‌న్స్‌గా నిలిచాయి.  గతంలో ఈ టోర్నీలో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, అనిల్ కుంబ్లే వంటి దిగ్గ‌జ క్రికెట‌ర్లు సైతం ఆడారు.

రూల్స్ ఇవే..
ఒక మ్యాచ్‌లో ప్ర‌తీ జ‌ట్టు 6 ఓవ‌ర్లు మాత్ర‌మే ఆడుతోంది. మ్యాచ్ ఆడే రెండు జ‌ట్ల‌లో ఆరుగురు ఆట‌గాళ్లు ఉండాలి. గ్రూప్ దశలో ఒక్కో ఓవర్‌కు  ఆరు బంతులు ఉంటాయి. అదే ఫైనల్‍లో ఒక్కో ఓవర్లో ఎనిమిది బంతులు ఉంటాయి. . వికెట్ కీపర్ మినహా జట్టులోని ప్రతి ఒక్కరు ఒక్కో ఓవర్ వేయాల్సి ఉంటుంది. 
చదవండి: వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం.. వణికి పోయిన బౌలర్లు
 

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)