Breaking News

‘అతడిని ఎంపిక చేయబోం.. రిటైరవ్వడమే మంచిది’

Published on Sun, 08/02/2026 - 17:52

భారత జట్టు సీనియర్ ఫాస్ట్ బౌలర్ మ‌హ్మ‌ద్ ష‌మీ టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకోవడం కష్టమే అనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. తాజాగా భువనేశ్వర్ కుమార్‌తో పాటు మహమ్మద్ షమీ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీలక ప్రకటన చేయ‌డం ఈ వార్త‌ల‌కు బ‌లం చేకూరుస్తుంది. 

2027 వన్డే ప్ర‌పంచ‌కప్ కోసం 15 మంది ఫాస్ట్ బౌలర్లను సిద్ధం చేస్తున్నట్లు బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ తెలిపాడు. అయితే ఇందులో అందరూ యంగ్ బౌలర్లే ఉంటార‌ని అగార్కర్ పేర్కొన్నాడు. 30 సంవత్సరాలు దాటిన బౌలర్లను తాము పరిగణలోకి తీసుకోవడం లేదని బాంబు పేల్చాడు.

'షమీ టీమిండియా అత్యుత్తమ మ్యాచ్ విన్నర్లలో ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో షమీ ఛాంపియన్. కానీ భవిష్యత్తు కోసం మేము యువ పేస్ బౌలింగ్ దళానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. భారత క్రికెట్‌కు అతని సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. మేము అతడిని గౌరవిస్తున్నాము.’ అని చెప్పుకొచ్చాడు. అగార్క‌ర్ వ్యాఖ్య‌ల‌ ను బ‌ట్టి చూస్తే మాత్రం షమీ రిటైర్మెంట్‌కు స‌మయం ఆస‌న్న‌మైందంటూ ప‌రోక్షంగా హింట్ ఇచ్చిన‌ట్లు అనిపిస్తోంది.

ఒకప్పుడు భారత బౌలింగ్ దళానికి ప్రధాన బలంగా నిలిచిన షమీ.. ఇప్పుడు సెలెక్టర్ల దీర్ఘకాలిక ప్రణాళికల్లో చోటు దక్కించు కోలేకపోతున్నట్లు తెలుస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్ చేరడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా నిలిచి తన ప్రతిభను చాటుకున్నాడు. 

అనంతరం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో చివరిసారిగా భారత జట్టు తరఫున వన్డే ఆడగా, అదే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో చివరిసారి కనిపించాడు. ష‌మీతో పాటు భువ‌నేశ్వ‌ర్ కుమార్ కూడా 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని ఎదురుచూస్తున్నారు. దీనికి త‌గిన‌ట్లుగానే గత రెండేళ్లుగా వీళ్లిద్ద‌రి గణాంకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. 

దేశవాళీ, రంజీలు అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్స్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. అయినప్పటికీ బీసీసీఐ మాత్రం ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లను పట్టించుకోవడం లేదు. అవకాశాలు ఇవ్వడం లేదు. ముఖ్యంగా హెడ్‌కోచ్‌గా గంభీర్‌, సెలెక్ట‌ర్‌గా అజిత్ అగార్కర్ వ‌చ్చిన తర్వాత వీళ్ల అడ్రస్ గల్లంత‌య్యింది.

చదవండి: హార్దిక్ మాజీ భార్యపై తీవ్ర‌ విమ‌ర్శ‌లు!

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)