Breaking News

‘వైభవ్‌ సూర్యవంశీ ఉంటే డబుల్‌ సెంచరీ చేసేవాడు’

Published on Tue, 10/07/2025 - 14:34

భారత క్రికెట్‌లో కొన్నాళ్లుగా వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పేరు మారుమ్రోగిపోతోంది. పన్నెండేళ్ల వయసులోనే రంజీల్లో అరంగేట్రం చేసిన ఈ బిహారీ పిల్లాడు.. పద్నాలుగేళ్లకే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లోనూ అడుగుపెట్టాడు. అంతేకాదు.. అత్యంత పిన్న వయసులో ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.

ఫాస్టెస్ట్‌ సెంచరీలు
ఈ ఏడాది రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లోనే శతకం బాది వైభవ్‌ సూర్యవంశీ ఈ ఘనత సాధించాడు. ఇక ఆ తర్వాత భారత్‌ అండర్‌-19 జట్టు తరఫునా పరుగుల వరద పారిస్తున్నాడు ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.

ఇటీవల ఇంగ్లండ్‌ పర్యటనలో యూత్‌ వన్డేల్లో అత్యంత వేగవంతమైన శతకం నమోదు చేసిన వైభవ్‌ సూర్యవంశీ.. తాజాగా ఆస్ట్రేలియా గడ్డ మీద కూడా సత్తా చాటుతున్నాడు. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌ రాయల్స్‌ హై పర్ఫామెన్స్‌ డైరెక్టర్‌ జుబిన్‌ బరూచా (Zubin Barucha) వైభవ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వైభవ్‌ సూర్యవంశీ ఉంటే డబుల్‌ సెంచరీ చేసేవాడు
‘‘వీలైనంత త్వరగా అతడిని సీనియర్‌ జట్టు (టీమిండియా)లోకి పంపించాలి. చాలా ఏళ్ల క్రితం సచిన్‌ టెండుల్కర్‌ (16 ఏళ్ల వయసులో అరంగేట్రం) విషయంలో ఇలాగే చేశారు. ఇప్పుడు వైభవ్‌ విషయంలోనూ త్వరగా నిర్ణయం తీసుకోవాలి.

కనీసం ఇండియా-‘ఎ’ తరఫునైనా అతడిని ఆడించాలి. తక్షణమే ఆ జట్టులోకి వైభవ్‌ను పంపించండి. ఇటీవల అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా-ఎ బౌలర్ల బౌలింగ్‌ చూస్తే.. వైభవ్‌ గనుక జట్టులో ఉండి ఉంటే డబుల్‌ సెంచరీ బాదేవాడని అనిపించింది.

జోఫ్రా ఆర్చర్‌ను ఎదుర్కోవడానికి స్టీవ్‌ స్మిత్‌ వంటి మేటి బ్యాటర్లే భయపడతారు. మా జట్టు తరఫున నెట్స్‌లో బరిలోకి దిగినా ఆర్చర్‌ ప్రధాన మ్యాచ్‌లో మాదిరే బౌల్‌ చేస్తాడు. అలా ఓసారి ప్రాక్టీస్‌ సెషన్‌లో ఆర్చర్‌ బౌలింగ్‌లో స్మిత్‌ తలకు గాయమైంది.

ఆరోజు వైభవ్‌ అద్భుతం చేశాడు
అప్పటి నుంచి ఆర్చర్‌ నెట్స్‌లో ఉంటే స్మిత్‌ బ్యాటింగ్‌కు వచ్చేవాడే కాదు. అందుకే ఆర్చర్‌ బౌలింగ్‌లో వైభవ్‌ బ్యాటింగ్‌ చేయబోతున్నపుడు నేను భయపడ్డాను. కానీ.. ఆ పిల్లాడు బ్యాక్‌ఫుట్‌ షాట్‌ ఆడి.. బంతిని స్టేడియం అవతలకు తరలించాడు. 

నాతో పాటు కోచింగ్‌ స్టాఫ్‌.. ఆఖరికి ఆర్చర్‌ కూడా ఆశ్చర్యపోయాడు’’ అని జుబిన్‌ బరూచా చెప్పుకొచ్చాడు. వైభవ్‌ను త్వరలోనే టీమిండియాకు ఎంపిక చేయాలని చీఫ్‌ సెల క్టర్‌ అజిత్‌ అగార్కర్‌కు ఈ మేరకు విజ్ఞప్తి చేశాడు.

కాగా సొంతగడ్డపై ఇండియా-‘ఎ’ జట్టు ఇటీవల ఆసీస్‌-‘ఎ’తో రెండు అనధికారిక మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడింది. ఈ సిరీస్‌ను 1-0తో భారత్‌ సొంతం చేసుకుంది. 

చదవండి: 50 ఓవర్ల క్రికెట్‌లో ట్రిపుల్‌ సెంచరీ.. ఆసీస్‌ బ్యాటర్‌ విధ్వంసం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)