అత‌డికి 2 నెల‌లే డెడ్‌లైన్‌.. రోహిత్‌, కోహ్లి​కి మంచి రోజులు!

Published on Fri, 07/24/2026 - 10:41

టీమిండియా చీఫ్ సెలెక్ట‌ర్ ప‌ద‌విలో కొన‌సాగుతున్న మాజీ క్రికెట‌ర్‌ అజిత్ అగార్క‌ర్ ప‌ద‌వీకాలం ఈ సెప్టెంబ‌ర్‌తో ముగియ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కాగా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు త‌న‌ను సెలెక్ట‌ర్‌గా కొన‌సాగేందుకు అవ‌కాశ‌మివ్వాల‌ని అగార్క‌ర్ చేసిన అభ్య‌ర్థ‌న‌ను బీసీసీఐ ప‌ట్టించుకోనట్లుగా అనిపిస్తోంది. సెలెక్ట‌ర్‌గా ఎంపికైన త‌ర్వాత టీమిండియా ఐసీసీ టైటిల్స్‌ సాధించినప్పటికీ అగార్క‌ర్ విష‌యంలో మాత్రం విమ‌ర్శ‌లే వ్యక్తమయ్యాయి. 

అందుకే అగార్క‌ర్‌ను సెలెక్ట‌ర్‌గా కొన‌సాగించేందుకు బీసీసీఐ ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది. దీంతో అత‌డి స్థానంలో కొత్త సెలెక్ట‌ర్ కోసం వెతుకులాట‌ను ప్రారంభించిన‌ట్లు స‌మాచారం. ఇక అగార్క‌ర్ సెలెక్ట‌ర్ ప‌ద‌వి నుంచి దిగిపోతే మాత్రం రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిల‌కు వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ 2027 ఆడేందుకు మార్గం సుగ‌మం అవుతుంద‌ని కొంద‌రు త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అ

న్నీ అనుకున్న‌ట్లుగా జ‌రిగితే మాత్రం సెప్టెంబ‌ర్ త‌ర్వాత టీమిండియాకు కొత్త సెలెక్ట‌ర్‌ను చూసే అవ‌కాశాలున్నాయి. సెప్టెంబ‌ర్ త‌ర్వాత నుంచి జ‌ర‌గ‌నున్న సిరీస్‌ల‌కు కొత్త సెలెక్ట‌ర్ నేతృత్వంలోనే జ‌ట్టు ఎంపిక జ‌ర‌గ‌నుంది. ఇక అజిత్ అగార్కర్ 2023లో టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జట్టులో పలు కీలక మార్పులు చేస్తూ వస్తున్నాడు. 


Photo Credit: BCCI Twitter

అగార్కర్ పదవీకాలంలో టీమిండియా నాలుగు ఐసీసీ టోర్నీలు ఆడింది. 2023 వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ 2024, చాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 ప్రపంచ కప్ 2026.. వీటిల్లో మూడు టైటిళ్లు భారత జట్టు సొంతం చేసుకోవడం విశేషం. అయిన‌ప్ప‌టికీ సెలెక్ట‌ర్‌గా అగార్క‌ర్‌పై మాత్రం విమ‌ర్శ‌లే రావ‌డం గ‌మ‌నార్హం. జట్టు సెలక్షన్ విషయంలో అగార్కర్ తీసుకున్న పలు నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. 

సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 జట్టుకు కెప్టెన్ చేయడం, హార్దిక్ పాండ్యకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడంపై అభిమానులు బ‌హిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని మాటలు అన్నా.. తన నిర్ణయాలను మాత్రం అగార్కర్ బహిరంగంగానే సమర్థించుకుంటూ వచ్చాడు. 

సెలక్షన్ అనేది కేవలం ప్లేయర్ల గణాంకాలపై ఆధారపడదని, జట్టుకు సరిపోయే కాంబినేషన్, ఆటగాళ్ల పాత్రలు, వ్యూహాలు కీలకమని అగార్కర్ ప్యానెల్ నిరూపించింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో పాటు ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ గెలిచిన కార‌ణంగా 2025లోనే అగార్క‌ర్ సెలెక్ట‌ర్ ప‌ద‌వీకాల‌న్ని మ‌రో ఏడాది పొడిగించిన బీసీసీఐ మ‌రోసారి అత‌డి ప‌ద‌వీకాలాన్న పొడిగించేందుకు స‌ముఖ‌త వ్య‌క్తం చేయ‌డం లేదు.

చదవండి: Asian Games: క్రికెట్ ‘డ్రా’ విడుదల.. భార‌త్‌, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)