Breaking News

అఫ్గానిస్తాన్‌ సంచలనం.. 6 ఓవర్లలో 148 పరుగులు

Published on Fri, 11/07/2025 - 12:45

హాంకాంగ్‌ క్రికెట్‌ సిక్సెస్‌-2025 (Hong Kong Sixes) టోర్న‌మెంట్‌లో అఫ్గానిస్తాన్‌ వరుసగా రెండో విజయం సాధించింది. శుక్రవారం మోంగ్‌కాక్‌ వేదికగా తొలుత నేపాల్‌ను 17 పరుగుల తేడాతో ఓడించిన అఫ్గాన్‌.. తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో గెలుపొందింది.

నైబ్‌ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్తాన్‌ నిర్ణీత 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 148 పరుగులు చేసింది. అఫ్గాన్‌ కెప్టెన్‌ నైబ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. మోంగ్‌కాక్‌ మిషన్ రౌండ్‌ గ్రౌండ్‌లో నైబ్‌ సిక్సర్ల వర్షం కురిపించాడు. తన మెరుపు బ్యాటింగ్‌తో సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 

నైబ్‌ కేవలం 12 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుదిరిగాడు. అతడితో పాటు మరో సీనియర్‌ ఆల్‌రౌండర్‌ కరీం జనత్‌ కూడా తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. జనత్‌ కేవలం 11 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 50 పరుగులు చేశాడు. ప్రోటీస్‌ బౌలర్లలో బయోమీ రెండు వికెట్లు సాధించాడు.

అనంతరం లక్ష్య చేధనలో సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 99 పరుగులకే పరిమితమైంది. జోరిచ్ వాన్ షాల్క్విక్(37) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కాషీఫ్ జోసెఫ్(22) రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరగగా..  జాన్ కన్నింగ్‌హామ్(22) టైమడ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. మెరుపు హాఫ్‌ సెంచరీతో చెలరేగిన నైబ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.
చదవండి: పాకిస్తాన్‌ కెప్టెన్‌ విధ్వంసం.. 12 బంతుల్లో హాఫ్‌ సెంచరీ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)