Breaking News

Asia Cup Final: పాకిస్తాన్‌ భారీ స్కోర్‌

Published on Sun, 12/21/2025 - 14:37

దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఏసీసీ మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌-2025 ఫైనల్లో భారత్‌, పాకిస్తాన్‌ అమీతుమీ తేల్చుకుంటున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ సమీర్‌ మిన్హాస్‌ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.

పాక్‌ ఇన్నింగ్స్‌లో సమీర్‌ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. సమీర్‌ ఒక్కడే వన్‌ మ్యాన్‌ షో చేశాడు. అహ్మద్‌ హుసేన్‌ (56) సమీర్‌కు అండగా నిలిచాడు. ఉస్మాన్‌ ఖాన్‌ (35) పర్వాలేదనిపించాడు. ఓ దశలో పాక్‌ 400 పరుగుల మార్కు దాటుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు పుంజుకోవడంతో పాక్‌ ఆఖర్లో త్వరితగతిన 5 వికెట్లు కోల్పోయింది. ఇదే సమయంలో స్కోర్‌ కూడా నెమ్మదించింది.

చివరి మూడు ఓవర్లలో పాక్‌ టెయిలెండర్లు నికాబ్‌ షఫీక్‌ (12 నాటౌట్‌), మొహమ్మద్‌ సయ్యమ్‌ (13 నాటౌట్‌) మరో వికెట్‌ పడకుండా జగ్రత్తగా ఆడి జట్టు స్కోర్‌ను 350 పరుగుల మార్కు వరకు తీసుకెళ్లారు. భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. హెనిల్‌ పటేల్‌, ఖిలన్‌ పటేల్‌ తలో 2, కనిష్క్‌ చౌహాన్‌ ఓ వికెట్‌ తీశారు. కాగా, ఈ టోర్నీ సెమీఫైనల్లో భారత్‌ శ్రీలంకను.. పాక్‌ బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరాయి. 

చదవండి: చరిత్ర సృష్టించిన డెవాన్‌ కాన్వే.. తొలి న్యూజిలాండ్‌ బ్యాటర్‌గా

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)