Breaking News

మరోసారి దడదడలాడించిన అభిషేక్‌ శర్మ

Published on Tue, 12/02/2025 - 13:22

ఐసీసీ వరల్డ్‌ నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) తన అరివీర భయంకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అంతర్జాతీయ టీ20లకు విరామం రావడంతో దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ ఆడుతున్న అభిషేక్‌.. ఇక్కడ కూడా ప్రత్యర్దులను చీల్చిచెండాతున్నాడు.

ఈ టోర్నీలో పంజాబ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. రెండు రోజుల కిందట బెంగాల్‌పై సుడిగాలి శతకం (52 బంతుల్లో 148) బాదాడు. ఇవాళ (డిసెంబర్‌ 2) బరోడాపై మెరుపు అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం​ 18 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. 

అనంతరం రాజ్‌ లింబాని బౌలింగ్‌లో ఔటయ్యాడు. అభిషేక్‌తో పాటు అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (32 బంతుల్లో 69; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. నమన్‌ ధిర్‌ (28 బంతుల్లో 39) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌ ఆడాడు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బరోడా ఆటగాళ్లు కూడా చెలరేగి ఆడుతున్నారు. 4 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా 51 పరుగులు చేశారు. ఓపెనర్లు శాశ్వత్‌ రావత్‌ 30, విష్ణు సోలంకి 14 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, దీనికి ముందు బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ కేవలం 12 బంతుల్లోనే అర్ద సెంచరీ చేశాడు. పొట్టి క్రికెట్‌లో అది మూడో వేగవంతమైన అర్ద సెంచరీ.

 

 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)