Breaking News

ఇది క‌దా స‌క్సెస్ అంటే.. గురువు రికార్డునే బ‌ద్ద‌లు కొట్టిన అభిషేక్

Published on Mon, 09/15/2025 - 15:42

ఆసియాక‌ప్‌-2025లో దుబాయ్ వేదిక‌గా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు. 128 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో పాక్ బౌల‌ర్ల‌ను  అభిషేక్ ఉతికారేశాడు. ఈ పంజాబ్ ఆట‌గాడు ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే బౌండరీలు బాద‌డం మొద‌లు పెట్టాడు. 

అభిషేక్ కేవ‌లం 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 31 ప‌రుగులు చేశాడు. ఈ యువ సంచ‌ల‌నం త‌న ఇన్నింగ్స్‌ను 238.46 స్ట్రైక్ రేట్‌తో ముగించాడు. ఈ మ్యాచ్‌లో అద్బుత‌మైన బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న కన‌బ‌రిచిన అభిషేక్‌.. త‌న మెంటార్ యువ‌రాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేశాడు.

పాకిస్తాన్‌పై టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన భార‌త బ్యాట‌ర్‌గా అభిషేక్ రికార్డులెక్కాడు. యువ‌రాజ్ సింగ్ 2012లో పాక్‌పై 200.00 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి 36 బంతుల్లో 72 పరుగులు చేశాడు. 

తాజా మ్యాచ్‌లో 238.46 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన అభిషేక్‌.. యువీని అధిగ‌మించాడు. కాగా అభిషేక్‌ శర్మ కెరీర్‌ ఎదుగుదలలో యువరాజ్‌ది కీలక పాత్ర. అతడి గైడెన్స్‌లోనే అభిషేక్‌ ఇంతలా రాటు దేలాడు. ఈ పంజాబీ బ్యాటర్‌కు యువీ దగ్గరుండి మరి మెళకువలు నేర్పాడు. ఇప్పుడు అభిషేక్ టీ20ల్లో ఏకంగా వ‌ర‌ల్డ్ నెం1 బ్యాట‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో పాక్‌ను 7 వికెట్ల తేడాతో భారత్‌ చిత్తు చేసింది.
చదవండి: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)