Breaking News

తొలి టీ20లో భారత్‌ ఘన విజయం

Published on Wed, 01/21/2026 - 22:52

న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్‌ను 48 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది

ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. మరో ఓపెనర్ సంజూ శాంసన్ విఫలమైనప్పటికి అభిషేక్ మాత్రం కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్లుతో 84 పరుగులు చేశాడు. అతడితో పాటు రింకూ సింగ్‌(24 బంతుల్లో 44 నాటౌట్‌), సూర్యకుమార్ యాదవ్(32), హార్దిక్ పాండ్యా(25) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్‌, జాకబ్ డఫ్ఫీ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్‌, సోధీ, క్లార్క్ తలా వికెట్ సాధించారు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7  వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగల్గింది. కివీస్‌ స్టార్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు. ఫిలిప్స్‌ కేవలం 40 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78 పరుగులు చేశాడు. 

అతడితో పాటు చాప్‌మన్‌(39)రాణించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, శివమ్‌ దూబే రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్‌, అర్ష్‌దీప్‌, అక్షర్‌ పటేల్‌ తలా వికెట్‌ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 రాయ్‌పూర్‌ వేదికగా శుక్రవారం(జనవరి 23) జరగనుంది.
చదవండి: అరుదైన మైలురాయిని తాకిన సూర్య భాయ్‌
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)