ఇంగ్లండ్ గడ్డపై అభిషేక్ అరుదైన రికార్డు

Published on Wed, 07/01/2026 - 23:27

టీమిండియా విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లోనూ తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ అభిషేక్ మాత్రం తన బ్యాటింగ్‌లో దూకుడు కొనసాగించాడు. తద్వారా 20 బంతుల్లోనే అర్ధశతకం మార్క్ అందుకున్న అభిషేక్ శర్మ ఇంగ్లండ్ గడ్డపై అరుదైన ఫీట్ సాధించాడు. 

ఇంగ్లండ్ గడ్డపై టీ20ల్లో టీమిండియా తరఫున తక్కువ బంతుల్లో ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. గతంలో కేఎల్ రాహుల్ 2018లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో 27 బంతుల్లో ఫిఫ్టీ సాధించడమే ఇప్పటివరకు రికార్డుగా ఉంది. తాజాగా అభిషేక్ కేఎల్ రాహుల్ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో పాటు అభిషేక్ ఖాతాలో మ‌రో అరుదైన రికార్డు కూడా వ‌చ్చి చేరింది. 

టీ20 క్రికెట్‌లో అభిషేక్ శ‌ర్మ వంద సిక్స‌ర్లు పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ కంటే ముందు టీమిండియా త‌ర‌ఫున రోహిత్ శ‌ర్మ (205 సిక్స‌ర్లు), సూర్యకుమార్ యాద‌వ్ (179 సిక్స‌ర్లు), హార్దిక్ పాండ్యా (126 సిక్స‌ర్లు), విరాట్ కోహ్లీ (124 సిక్స‌ర్లు) ఉన్నారు. అయితే టీమిండియా త‌ర‌ఫున టీ20ల్లో వంద సిక్స‌ర్లు కొట్టిన తొలి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట‌ర్‌గా అభిషేక్ శ‌ర్మ నిలిచాడు. 49 మ్యాచ్‌ల్లోనే అభిషేక్ వంద సిక్స‌ర్లు పూర్తి చేసుకోవ‌డం మ‌రో విశేషం. ఇక అభిషేక్‌ శర్మకు టీ20ల్లో 48 ఇన్నింగ్స్‌ల్లో ఇది పదకొండో ఫిఫ్టీ కావడం గమనార్హం.
 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)