అభిషేక్‌ శర్మ రేర్‌ రికార్డు.. రోహిత్‌, కోహ్లికి కూడా సాధ్యం కాలేదు

Published on Sat, 12/06/2025 - 21:24

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో టీమిండియా యువ ఓపెనర్‌, పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నీలో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా స‌ర్వీసెస్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో అభిషేక్ విధ్వంసం సృష్టించాడు.

ఈ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 34 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. అదేవిధంగా అభిషేక్‌ 2025 ఏడాదిలో టీ20ల్లో వంద సిక్స్‌లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఒకే క్యాలెండర్ ఈయర్‌లో టీ20ల్లో 100 సిక్స్‌ల మైలురాయిని అందుకున్న మొదటి భారత ఆటగాడిగా అభిషేక్ చరిత్రకెక్కాడు. ఇప్పటివర​కు ఈ ఫీట్ ఎవరూ సాధించలేకపోయారు.

అభిషేక్ ఈ ఏడాది ఆరంభం నుంచే టీ20ల్లో దుమ్ములేపుతున్నాడు. ఇంగ్లండ్ టీ20 సిరీస్‌తో పాటు ఐపీఎల్‌, ఆసియాకప్‌, ఆసీస్ టూర్‌, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టాడు. ఈ సంవత్సరం టీ20ల్లో అభిషేక్ శర్మ ఇప్పటివరకు 42.82 సగటుతో 1,499 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 149గా ఉంది.

పంజాబ్‌ ఘన విజయం
ఇక ఈ మ్యాచ్‌లో సర్వీసెస్‌ టీమ్‌ను 73 పరుగుల తేడాతో పంజాబ్‌ చిత్తు  చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. పంజాబ్‌ బ్యాటర్లలో అభిషేక్‌తో పాటు ఫ్రబ్‌సిమ్రాన్‌ సింగ్‌(50), నమన్‌ ధీర్‌(54) హాఫ్‌ సెంచరీలతో మెరిశారు.

అనంతరం సర్వీసెస్‌ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్‌ బౌలర్లలో అభిషేక్‌ శర్మ, సన్వీర్‌ సింగ్‌, హర్‌ప్రీత్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)