Breaking News

జైస్వాల్‌ సెంచరీ చేయకుండా అడ్డుకున్న సుయాశ్‌.. ఏకి పారేసిన ఆకాశ్‌

Published on Fri, 05/12/2023 - 15:41

కేకేఆర్‌తో నిన్న (మే 11) జరిగిన ఎలెక్ట్రిఫైయింగ్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 98 పరుగులు చేసి తన జట్టుకు బంతుల పరంగా (41) అతి పెద్ద విజయాన్ని అందించాడు. అయితే యశస్వి 2 పరుగుల తేడాతో సీజన్‌లో రెండో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోవడం అందరినీ బాధించింది. 

ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా ప్రత్యేకంగా స్పందించాడు. కేకేఆర్‌ బౌలర్‌ సుయాశ్‌ శర్మ ఉద్దేశపూర్వకంగా జైస్వాల్‌ను సెంచరీ చేయనీయకుండా అడ్డుకున్నాడని మండిపడ్డాడు. సుయాశ్‌ చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన ఆకాశ్‌.. పాక్‌ బౌలర్‌, కోహ్లిని సెంచరీ చేయనీకుండా అడ్డుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండని అన్నాడు. సుయాశ్‌, సొంత దేశ ఆటగాడి విషయంలో ఇలా ప్రవర్తించడం​ నిజంగా సిగ్గుచేటు అన్న అర్ధం వచ్చేలా ట్వీట్‌ చేశాడు. సుయాశ్‌ చర్యను పూర్‌ టేస్ట్‌గా అభివర్ణించాడు. ఆకాశ్‌ తన ట్వీట్‌లో సుయాశ్‌ చర్యను సమర్ధించిన వారిని కూడా ఏకి పారేశాడు.  

కాగా, రాజస్థాన్‌ గెలుపుకు నాలుగు పరుగులు చేయాల్సిన తరుణంలో, జైస్వాల్‌ 94 పరుగుల స్కోర్‌ వద్ద ఉండగా సుయాశ్‌ ఉద్దేశపూర్వకంగా వైడ్‌ బాల్‌ వేసేందుకు ప్రయత్నించాడు. అప్పటికే అప్రమత్తంగా ఉన్న సంజూ శాంసన్‌ దాన్ని డిఫెండ్‌ చేసి జైస్వాల్‌కు స్ట్రయిక్‌ రొటేట్‌ చేశాడు. అయితే జైస్వాల్‌ విన్నింగ్‌ షాట్‌ను సిక్సర్‌గా మలచలేకపోవడంతో 98 పరుగుల వద్దే ఆగిపోయి, సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 

చదవండి: నాకే ఎందుకిలా? వెక్కి వెక్కి ఏడ్చా.. గుండు చేసుకున్నా: సూయశ్‌ శర్మ

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)