Breaking News

గెలిచిన మ్యాచ్‌లు కంటే ఓడిందే ఎక్కువ.. గంభీర్‌పై తీవ్ర ఒత్తిడి: ఆకాష్

Published on Sat, 06/28/2025 - 12:23

జూలై 2 నుంచి ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం భార‌త జ‌ట్టు త‌మ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తొలి టెస్టు ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో టీమిండియా ప్ర‌ధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై భార‌త మాజీ క్రికెట‌ర్ ఆకాశ్ చోప్రా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. 

లీడ్స్‌లో టెస్టులో ఓట‌మితో గంభీర్‌పై ఒత్తిడి పెరిగింద‌ని చోప్రా అభిప్రాయ‌ప‌డ్డాడు. హెడ్ కోచ్‌గా బాధ్య‌తలు చెప‌ట్టిన త‌ర్వాత భార‌త జ‌ట్టు బంగ్లాపై మినహా ఒక్క ప్ర‌ధాన టెస్టు సిరీస్‌లో కూడా విజ‌యం సాధించ‌లేక‌పోయింది. స్వ‌దేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌, బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో 1-3తో ఓడిపోవ‌డంతో గంభీర్ విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో సిరీస్‌ను కూడా ఓట‌మితో ఆరంభించ‌డం గంభీర్‌పై ప్రశ్నల వర్షం కురుస్తోంది.

"గెలిచిన‌ప్పుడు ప్ర‌శంస‌లు, ఓడిపోయిన‌ప్పుడు విమ‌ర్శ‌లు గుప్పించ‌డం భార‌త క్రికెట్ సూత్రం. మ్యాచ్‌లో గెలిచి అన్ని బాగా జ‌రిగితే అంద‌రికి ఆ క్రెడిట్ ద‌క్కుతుంది. అదే ఓట‌మి పాలైతే ప్రతీ ఒక్కరూ విమ‌ర్శ‌లు ఎదుర్కొక త‌ప్ప‌దు. లీడ్స్ టెస్టులో ఓట‌మికి కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌ను నేను బాధ్యుడిని చేయాల‌నుకోవ‌డం లేదు.

ఎందుకంటే అత‌డు ఇప్పుడే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. పరిస్థితుల‌ను ఆర్ధం చేసుకోవ‌డానికి  అతడికి కాస్త స‌మయం ప‌డుతోంది.  కానీ గౌతం గంభీర్‌పైన మాత్రం ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి ఉంటుంది. రెడ్ బాల్ క్రికెట్‌లో కోచ్‌గా త‌న మార్క్ చూపించ‌లేక‌పోయాడు. అత‌డి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో భారత్ చాలా తక్కువ ‍మ్యాచ్‌లను గెలిచింది. 

బంగ్లాదేశ్‌పై రెండు, ఆస్ట్రేలియాపై ఒక్క టెస్టు మ్యాచ్ మాత్రమే టీమిండియా విజయం సాధించింది. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాపై చెరో మూడు మ్యాచ్‌లలో భారత్ ఓటమి పాలైంది. ఇప్పుడు ఇంగ్లండ్‌పై కూడా ఓ మ్యాచ్ భారత్ ఓడిపోయింది. అతడి నేతృత్వంతో భారత్ కేవలం ఓటముల తప్ప విజయాలు సాధించలేకపోతుంది.

 ఇంగ్లండ్ సిరీస్‌లో ఆశించింన‌ ఫ‌లితం రాక‌పోతే గంభీర్ స్ధానం ప్ర‌శ్నార్ధ‌కంగా మారుతోంది. ఎందుకంటే గంభీర్ కోరిన ప్రతీది సెలెక్టర్లు, బీసీసీఐ చేసింది. ఎలాంటి ఆటగాళ్లు కావాలంటే అలాంటి ప్లేయర్లను సెలెక్టర్లు ఇచ్చారు. అయిన‌ప్ప‌టికి విజ‌యాల‌ను అందించ‌క‌పోతే సెల‌క్ట‌ర్ల నుంచి ప్ర‌శ్న‌లు ఎదుర్కొక త‌ప్ప‌దు" తన యూట్యూబ్ ఛానల్‌లో చోప్రా పేర్కొన్నాడు.
చదవండి: MLC 2025: ఉత్కంఠ పోరు.. ఆఖ‌రి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన హెట్‌మైర్‌

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)