Breaking News

అభిషేక్‌ శర్మపై సూర్యకుమార్‌ సెటైర్లు.. ఓపెనర్‌ రియాక్షన్‌ ఇదే

Published on Fri, 11/07/2025 - 18:36

టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma)పై టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘‘సింహం గడ్డి తినడం ఎప్పుడైనా చూశారా? .. ఈరోజు సింహం మెల్లమెల్లగా గడ్డి తినడం మొదలుపెట్టింది’’ అంటూ సరదాగా సెటైర్లు వేశాడు. ఇంతకీ ఇందుకు కారణం ఏమిటంటే?..

మెరుగ్గానే..
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ (IND vs AUS T20Is)లో అభిషేక్‌ శర్మ మెరుగ్గా రాణిస్తున్నాడు. కాన్‌బెర్రా వేదికగా వర్షం కారణంగా అర్థంతరంగా రద్దైపోయిన తొలి టీ20లో ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. 14 బంతుల్లో 19 (4 ఫోర్లు, స్ట్రైక్‌ రేటు- 135.71) పరుగులు రాబట్టాడు. 

ఇక మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టీ20లో అభిషేక్‌ ధనాధన్‌ దంచికొట్టాడు. ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ కేవలం 37 బంతుల్లోనే 68   పరుగులతో చెలరేగాడు. ఇందులో 8 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండగా.. స్ట్రైక్‌రేటు 183.78.

అదే విధంగా..హోబర్ట్‌లో జరిగిన మూడో టీ20లోనూ అభిషేక్‌ ఫర్వాలేదనిపించాడు. 16 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 156కు పైగా స్ట్రైక్‌రేటుతో 25 పరుగులు చేశాడు. అయితే, క్వీన్స్‌లాండ్‌లో గురువారం ముగిసిన నాలుగో టీ20లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ 21 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది.. 28 రన్స్‌ రాబట్టాడు. స్ట్రైక్‌రేటు 133.33.

2-1తో ఆధిక్యంలో
ఇక ఆసీస్‌తో ఇప్పటికి నాలుగు టీ20లు ముగించుకున్న టీమిండియా.. రెండో టీ20లో ఓడి.. వరుసగా మూడు, నాలుగో మ్యాచ్‌లో గెలిచింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య శనివారం బ్రిస్బేన్‌లో నిర్ణయాత్మ​క ఐదో టీ20 నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.

నవ్వుతూనే సెటైర్లు.. అభిషేక్‌ రియాక్షన్‌ ఇదే
ఈ నేపథ్యంలో బ్రిస్బేన్‌కు పయనమవుతున్న సమయంలో సూర్యకుమార్‌ యాదవ్‌.. అభిషేక్‌ శర్మతో సరదాగా అన్న మాటలు వైరల్‌గా మారాయి. నాలుగో టీ20లో అభిషేక్‌ స్ట్రైక్‌రేటును ఉద్దేశించి.. ‘‘సింహం గడ్డి తింటుందా? కానీ ఇప్పుడు అదే జరుగుతోంది’’ అంటూ నవ్వుతూనే సెటైర్లు వేశాడు. ఇందుకు బిత్తరపోయిన అభిషేక్‌ తేరుకుని.. తనూ గట్టిగా నవ్వేశాడు.

కాగా నాలుగో టీ20లో సూర్యకుమార్‌ యాదవ్‌.. నాలుగో స్థానంలో వచ్చి 10 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. ఈ క్రమంలో ఆఖరిదైన ఐదో టీ20లోనూ ఓడించి సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. 

వన్డే సిరీస్‌ కోల్పోయిన టీమిండియా
ఇదిలా ఉంటే.. శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో ఆసీస్‌తో వన్డే సిరీస్‌ ఆడిన టీమిండియా చేదు అనుభవం చవిచూసింది. ఆతిథ్య ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. దీంతో వన్డే కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే గిల్‌ ఓటమి రుచిచూశాడు. అంతకు ముందు ఇంగ్లండ్‌ పర్యటనతో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన గిల్‌ 2-2తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేసి ఫర్వాలేదనిపించాడు.

చదవండి: ‘గిల్‌ కోసం బలి.. సంజూను కాదని జితేశ్‌ శర్మను అందుకే ఆడిస్తున్నారు’

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)