Breaking News

T20 WC 2026: చరిత్ర సృష్టించిన జింబాబ్వే ఆటగాళ్లు

Published on Tue, 02/24/2026 - 09:15

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో జింబాబ్వేపై వెస్టిండీస్‌ 107 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఓడినా, ఆ జట్టు ఆటగాళ్లు ఓ ప్రపంచకప్‌ రికార్డును సాధించారు. ఓటమి ఖరారైన వేల బ్రాడ్‌ ఈవాన్స్‌-రిచర్డ్‌ నగరవ పదో వికెట్‌కు 44 పరుగులు జోడించి, ప్రపంచకప్‌ చరిత్రలో పదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు.

సిక్సర్లతో విరుచుకుపడ్డారు
జింబాబ్వే ఓటమి ఖరారయ్యాక​ ఈవాన్స్‌, నగరవ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఈవాన్స్‌ 5, నగరవ ఓ సిక్సర్‌తో విధ్వంసం సృష్టించారు. షమార్‌ జోసఫ్‌ వేసిన 17వ ఓవర్‌లో ఈవాన్స్‌ మూడు సిక్సర్లు బాదాడు. అంతకుముందు జేసన్‌ హోల్డర్‌ వేసిన 16వ ఓవర్‌లోనూ రెండు సిక్సర్లు కొట్టాడు. దీనికి ముందు ఓవర్‌ చివరి బంతికి నగరవ ఓ సిక్సర్‌ బాదాడు.

ప్రపంచకప్‌ రికార్డు
ఈ మ్యాచ్‌లో మరో ప్రపంచకప్‌ రికార్డు కూడా నమోదైంది. ఇరు జట్లు కలిపి ఏకంగా 31 సిక్సర్లు బాదాయి. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక సిక్సర్లు ఇవే. గతంలో ఈ రికార్డు 2014 ఎడిషన్‌ నెదర్లాండ్స్‌-ఐర్లాండ్‌ మ్యాచ్‌ పేరిట ఉండేది. ఆ మ్యాచ్‌లో 30 సిక్సర్లు నమోదయ్యాయి.

ముగిసిన జైత్రయాత్ర
ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఓపెనర్‌ బ్రియాన్‌ బెన్నెట్‌ కూడా ఓ ప్రపంచకప్‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఔట్‌ కాకుండా అత్యధిక పరుగులు (180) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 5 పరుగుల వద్ద ఔట్‌ కావడంతో ప్రస్తుత ప్రపంచకప్‌లో బెన్నెట్‌ అజైత్రయాత్ర ముగిసింది. ఈ మ్యాచ్‌కు ముందు బెన్నెట్‌ 3 ఇన్నింగ్స్‌ల్లో 175 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. హెట్‌మైర్‌ (85), రోవ్‌మన్‌ పావెల్‌ (59), రూథర్‌ఫోర్డ్‌ (31 నాటౌట్‌), షెపర్డ్‌ (21), హోల్డర్‌ (13) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. బ్రాడ్‌ ఈవాన్స్‌ (43), నగరవ (7 నాటౌట్‌) చివరి వికెట్‌కు 44 పరుగులు జోడించి జింబాబ్వేను 100 పరుగుల మార్కును దాటించారు. మోటీ (4-1-28-4), అకీల్‌ హొసేన్‌ (4-1-28-3) తమ స్పిన్‌ మాయాజాలంతో జింబాబ్వే ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. 
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)