Breaking News

12 వేదికల్లో ప్రపంచకప్‌

Published on Sat, 08/01/2026 - 04:26

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ వేదికలు ఖరారయ్యాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం 12 వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఐసీసీ అధ్యక్షుడు జై షా వెల్లడించారు. 2027 వరల్డ్‌ కప్‌ లోగోనూ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా క్రికెట్‌ సంఘాల అధ్యక్షులతో కలిసి జై షా ఆవిష్కరించారు. 

చివరగా 2003లో దక్షిణాఫ్రికా వేదికగా వన్డే ప్రపంచకప్‌ జరగగా... మళ్లీ 24 ఏళ్ల తర్వాత అక్కడ ఈ మెగా టోర్నీ జరగనుంది. మొత్తం 12 వేదికల్లో ఎనిమిది (జొహన్నెస్‌బర్గ్, సెంచూరియన్, డర్బన్, గెబ్రా, కుగొంపో సిటీ, కేప్‌టౌన్, పార్ల్, బ్లూమ్‌ఫాంటైన్‌) దక్షిణాఫ్రికాలో ఉన్నాయి. ఇక్కడే 54 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. జింబాబ్వేలోని హరారే, బులవాయో, విక్టోరియా ఫాల్స్‌లోని మూడు మైదానాలు కూడా వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. ఇక్కడ 7 నుంచి 10 మ్యాచ్‌లు జరిగే అవకాశంఉంది. 

ఇక మరో ఆతిథ్య దేశం నమీబియాలోని ఏకైక మైదానంలో కనీసం 3 మ్యాచ్‌లు నిర్వహించవచ్చు. ఈ వేదికలన్నీ గతంలోనే నిర్ణయించగా... విక్టోరియా ఫాల్స్‌ మైదానాన్ని కొత్తగా చేర్చారు. అక్కడ కొత్తగా నిర్మించిన 10 వేల మంది అభిమానుల సామర్థ్యం గల స్టేడియంలో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ మాత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)