Breaking News

అప్పట్లో ప్రతిపక్షానికి ఒక్కటే.. ఇప్పుడు 16..!

Published on Fri, 11/06/2026 - 13:40

విజయనగరం అర్బన్‌: అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది? ప్రతిపక్షానికి క్షేత్రస్థాయిలో ఎంత ఆదరణ లభిస్తోంది? ఈ ప్రశ్రలకు విజయగనరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరమైన పోలికను ముందుకు తెస్తున్నాయి. ఐదేళ్ల కిందట వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలన మధ్యలో జరిగిన ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష టీడీపీకి కేవలం ఒక్క డివిజన్‌ మాత్రమే దక్కింది. తాజాగా కూటమి ప్రభుత్వ పాలన మధ్యలో జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ 16 స్థానాలను గెలుచుకుంది. ఈ రెండు ఫలితాల మధ్య వ్యత్యాసం ఇప్పుడు రాకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  

ఒక స్థానానికే పరిమితం...  
2021లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నకల్లో మొత్తం 50 డివిజన్లకు ఆ పార్టీ ఏకంగా 48 స్థానాలను గెలుచుకుంది. అప్పటి ప్రతిపక్ష టీడీపీకి ఒక్క స్థానం మాత్రమే దక్కగా, మరో స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి కైవసం చేసుకున్నారు. అంటే ప్రతిపక్షానికి కనీస స్థాయిలో కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ ఫలితాలు అప్పటి ప్రభుత్వ పాలనపై పట్టణ ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదనే అభిప్రాయానికి బలాన్నిచ్చాయి. అధికార పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ, ప్రతిపక్ష బలహీనత అప్పటి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి.  

ప్రజల తిరుగుబాటు...  
రెండున్నరేళ్ల చంద్రబాబు ప్రభుత్వ పాలనలో కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్లు మంజూరు చేయకపోవడం, నిరుద్యోగ భృతి ఎగ్గొట్టడం, ఆడబిడ్డ నిధి అందకపోవడం, నగరాభివృద్ధి పట్టించుకోకపోవడం, ప్రజా సంక్షేమ పథకాలను అమలుచేయకపోవడం, హామీలు నెరవేర్చకపోవం, ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలు అమలుచేయడంతో జనం తిరుగుబాటు ఆరంభించారు. దీనికి కార్పొరేషన్‌ ఎన్నికలే నిలువెత్తు నిదర్శనం. మొత్తం 62 డివజన్లలో వైఎస్సార్‌సీపీ 16 స్థానాలను గెలుచుకుంది. టీడీపీ, జనసేన, బీజేసీ కలిపి 44 స్థానాలు సాధించగా మరో రెండు స్థానాలను స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు. అధికార కూటమికి మెజారిటీ వచ్చినప్పటికీ, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ 16 స్థానాలు గెలుగుకోవడం గమనార్హం. ఐదేళ్ల కిందట ఇవే ఎన్నికల్లో ప్రతిపక్షానికి ఒక్క స్థానమే వచ్చిన పరిస్థితితో పోలిస్తే ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ప్రస్పుటమైందన్న వాదన వినిపిస్తోంది.   

ఇదీ చదవండి: ఖాకీ చొక్కా తీసేసి రా చూసుకుందాం.. టీడీపీ ఎమ్మెల్యే..


 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)