Breaking News

టీడీపీ ఉన్మాదులను ఉత్పత్తి చేస్తుంది: వరుదు కల్యాణి

Published on Tue, 07/15/2025 - 12:29

సాక్షి, విజయవాడ: జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై దాడిని నిరసిస్తూ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహిళలు ధర్నా చేశారు. మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నేతలు వినతి పత్రం ఇచ్చారు.  ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. మహిళపై దాడి చేస్తే హోంమంత్రి స్పందించలేదు. మహిళలపై దాడి చేస్తే అదే చివరి రోజున్న బాబు,పవన్‌ ఎక్కడ?’’ అంటూ నిలదీశారు.

టీడీపీ ఉన్మాదులను ఉత్పత్తి చేస్తుందంటూ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ చైర్మన్ పక్క నియోజకవర్గంలో కూడా పర్యటించకూడదా?. కూటమి పాలనలో ప్రజలు విసుగు చెందుతున్నారు. కచ్చితంగా చంద్రబాబు సర్కార్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.

ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ, ‘‘జడ్పీ చైర్‌పర్సన్‌పై జరిగిన దాడి సిగ్గుచేటు. బీసీ మహిళపై దాడితో సభ్య సమాజం తలదించుకుంటుంది. బీసీలు అంటే బ్యాక్ బోన్స్ అని చెప్పిన చంద్రబాబు.. ఆ బోన్స్ విరిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం.. సంక్షేమంలో రికార్డు లేదు కానీ.. దాడుల్లో రికార్డ్ సాధించింది. గంటసేపు మహిళపై నానా బూతులు మాట్లాడారు.

..దాడి చేయడమే కాకుండా ఉప్పాల రాముపై కేసు నమోదు చేశారు. బీసీ మహిళకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మహిళా సంఘం చైర్మన్ మౌనంగా ఉంది?. చట్టం అందరికీ ఒకటే అనే సంగతి మరిచారా?. తక్షణం హోం మంత్రి, డీజీపీ స్పందించి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలి. దాడి చేయడమే కాకుండా ఉప్పాల హారికని మహానటి అనడం దారుణం’’ అని కల్పలతారెడ్డి మండిపడ్డారు.

ఉప్పల హారిక పై దాడి.. విజయవాడలో మహిళలు భారీ నిరసన

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)