Breaking News

ఇంత జరిగినా మౌనమేలా మంత్రి లోకేశా?: YSRCP

Published on Fri, 05/30/2025 - 16:53

సాక్షి, గుంటూరు: తెలుగు రాష్ట్రాల చరిత్రలో మునుపెన్నడూ  లేని విధంగా విద్యా వ్యవస్థపై ఘోరమైన మరక పడింది. పదో తరగతి పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో తీవ్ర తప్పిదాలు జరిగాయి. వేలమంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టి మరీ మౌనంగా ఉండిపోయారంటూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌(Nara Lokesh)పై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

.. పదో తరగతి పరీక్ష ఫలితాల తర్వాత 60% మంది రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. బోర్డు చేసిన దారుణమైన తప్పులు పాసైన వారిని కూడా ఫెయిల్ చేశాయి. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వమే ప్రమాదంలోకి నెట్టింది. ఇంత దారుణం జరిగినా మంత్రి నారా లోకేష్‌ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని వైఎస్సార్‌సీపీ(YSRCP) ప్రశ్నించింది. 

.. నారా లోకేష్ చేసిన తీవ్రమైన ఒత్తిడి వలనే ఉపాధ్యాయులు మార్కులు తారుమారు చేయటానికి కారణమైంది. మొత్తం 66,363 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కోరారు. ఇప్పటి వరకు టెన్త్‌ రీవాల్యూషన్‌(AP 10th Class Revaluation) 11,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని స్వయానా ప్రభుత్వమే ప్రకటించింది. వాల్యుయేషన్ ఇంకా కొనసాగుతోందట. ఈ పరిణామంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అని వైఎస్సార్‌సీపీ(YSRCP), ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనను జోడించి తన ట్వీట్‌లో పేర్కొంది. అలాగే ఈ విషయాన్ని జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో.. అన్ని నేషనల్ మీడియాను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)