టీడీపీ తోడేళ్లు.. జనసేన గుంటనక్కలపై కేసులేవీ?: శ్యామల

Published on Fri, 04/11/2025 - 17:56

సాక్షి, తాడేపల్లి: టీడీపీ తోడేళ్లు.. జనసేన గుంటనక్కలు సోషల్ మీడియాలో మహిళలపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని.. ఈ నక్కలు, తోడేళ్లను పెంచి పోషిస్తోంది టీడీపీనే అంటూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. శుక్రవారం ఆమె ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఫ్యామిలీ సహా అందరిపైనా ఇష్టానుసారం ట్రోల్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బరితెగించి పోస్టులు పెడతున్న వారిపై ఎందుకు కేసులు పెట్టటం లేదంటూ ఆమె ప్రశ్నించారు.

‘‘ఒకడ్ని అరెస్టు చేసినట్టు చూపించి మహిళా ఉద్దారకుల్లాగ ప్రమోషన్ చేసుకుంటున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ గుంటనక్కలు, తోడేళ్లను ఎందుకు అరెస్టు చేయలేదు?. వైఎస్ జగన్ ఫ్యామిలీ గురించి ఇష్టానుసారం మాట్లాడిన హోంమంత్రి అనితపై ఎందుకు కేసు పెట్టలేదు?. కేవలం కిరణ్ అనే వ్యక్తిని అరెస్టు చేయటం ఒక డ్రామా. టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ. అరెస్టయిన చేబ్రోలు కిరణ్ విచారణలో చంద్రబాబు, లోకేష్ పేర్లే చెప్పాడు. మరి చంద్రబాబు, లోకేష్‌లపై ఎందుకు కేసు పెట్టలేదు?’’ అంటూ శ్యామల ప్రశ్నలు గుప్పించారు.

‘‘మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే చంద్రబాబు, పవన్ స్టేజీల మీద స్కిట్‌లు చేసుకుంటున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు సైకో అని దుర్భాషలాడారు. ఇది కరెక్టా?. పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ దారుణంగా కించపరిచేలా మాట్లాడారు. వారిని చూసే వారి కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.ఐ-టీడీపీ పేరుతో విష వృక్షాన్ని పెంచి పోషిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు కనీసం చదవడం లేదు. మహిళలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారు?. ఎంతమంది బాధితులను ఆమె పరామర్శించారు?’’ అని శ్యామల నిలదీశారు.

‘‘నా మీద కూడా దారుణంగా ట్రోల్స్ చేశారు. నా వ్యక్తిత్వహనానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో  పీ4 కాదు ఏ4 అమలవుతోంది. ఏ4 అంటే అరాచకాలు, అక్రమాలు, అఘాయిత్యాలు, అప్పులు’’ అంటూ శ్యామల వ్యాఖ్యానించారు.

మరి ఆ రోజు అనితపై ఎందుకు కేసు పెట్టలేదు: Syamala

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)