Breaking News

బాబు మోసంపై కూటమి నేతలు నోరు మెదపరేం

Published on Fri, 11/15/2024 - 11:51

వైఎస్సార్‌ కడప, సాక్షి: చంద్రబాబు పాలనలో రాయలసీమకు అంతులేని అన్యాయం జరుగుతుందని వైఎస్సార్‌ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కూటమి నేతలు ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. 

కర్నూలు కేంద్రంగా పని చేస్తున్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ను అమరావతికి తరలించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం నిర్ణయంపై రవీంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.  

‘‘శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు సీమలో పెట్టాలన్నారు.. కానీ పెట్టలేదు. అందరూ విస్మరించినా దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. హైకోర్టు కోసం బార్ కౌన్సిల్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో హెచ్ఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టు కర్నూలులో ఏర్పాటైంది.  

అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని జగన్ మూడు రాజధానుల పేరుతో కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించారు. రెండవ లా యూనివర్సిటీని కూడా కర్నూలులో పెట్టాలని నిర్ణయించారు.  ఇందుకోసం భూమి, 100 కోట్ల నిధులు కూడా కేటాయించారు. దాన్ని కూడా చంద్రబాబు తరలించుకుపోయారు.

ఇంతటి దుర్మార్గాలను చంద్రబాబే చేస్తాడు
గతంలో హైదారాబాద్ ఒకే రాజధాని అని నష్టపోవాల్సి వచ్చింది. అలా జరగకూడదు అని జగన్ ఆలోచించారు. కొప్పార్తి ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ తరలించారు. ఇంతటి దుర్మార్గాలను ఒక్క చంద్రబాబు మాత్రమే చేస్తాడు

రాయలసీమకు చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు నోరుమెదపాలి. వైఎస్సార్సీపీ తరపున సీమ అభివృద్ధి కోసం కలసి వచ్చే వారితో ఆందోళనలు చేస్తాం. టీడీపీని, ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ దీనిపై సమాధానం చెప్పాలి’ అని రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)