Breaking News

మరో పోరాటానికి వైఎస్సార్‌సీపీ సిద్ధం

Published on Thu, 07/23/2026 - 16:33

సాక్షి, తాడేపల్లి: ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యలపై నిరంతరం వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలపై పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. అమరావతి దోపిడీ నుంచి డీఎస్సీ అక్రమాల వరకూ అన్నింటినీ ప్రజల ముందు పెట్టి వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తోంది.

ఈ క్రమంలో మరో పోరాటానికి వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. 28న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు చేపట్టనుంది. పార్టీ యువత, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనుంది. డీఎస్సీ అక్రమాలు, నీట్ పరీక్షలో జరిగిన తప్పులు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబ్సర్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నిరసనలు నిర్వహించనుంది.

వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. యువతను చంద్రబాబు తీవ్రంగా మోసం చేశారని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో కోటి‌మంది యూత్ ఉన్నారని చంద్రబాబు చెప్తున్నారు. ఉద్యోగం వచ్చేంత వరకు వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ.72 వేల కోట్ల బకాయి పడ్డారు. డీఎస్సీలో భారీగా జరిగిన అక్రమాలను సాక్షాలతో బయటపెట్టాం. అయినా చంద్రబాబు పట్టించుకోవటం లేదు. బంగ్లాదేశ్‌లో యువత తిరగపడితే ఏం జరిగిందో చంద్రబాబు గుర్తుంచుకోవాలి’’ అని ఆయన హెచ్చరించారు.

‘‘ఢిల్లీలో యువత చేస్తున్న ఆందోళనలు ఎలా ఉన్నాయో చూడండి. చంద్రబాబు యువత విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. నీట్ పేపర్ లీక్ తో లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబిఐ విచారణ చేయాలి. నీట్ తప్పులు, ఫీజు  రీయింబ్సర్‌మెంట్‌పై పోరాటం చేస్తాం. 28న జిల్లా కేంద్రాల్లో యూత్, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ర్యాలీలు చేస్తాం’’ అని జక్కంపూడి రాజా తెలిపారు.

స్టూడెంట్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మాట్లాడుతూ.. డీఎస్సీలో పారదర్శకత లేదని.. మొదటి ర్యాంకు వచ్చిన వారికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. మెరిట్, రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్ కోటా వారు డీఎస్సీ పరీక్షలు రావాల్సిన పనిలేదని జీవో ఇచ్చారు. బంగారు పతకం సాధించిన దుర్గయ్యకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?. డీఎస్సీలో అన్నీ అక్రమాలే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వని కారణంగా విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. రూ.9 వేల కోట్లపైనే బకాయిలు పడ్డారు’’ అని రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)