Breaking News

పెల్లుబికిన ప్రజా వ్యతిరేకత

Published on Thu, 06/05/2025 - 05:04

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏడాదిగా టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను నిలదీస్తూ బుధవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నిర్వహించిన నిరసన ర్యాలీలకు ప్రజలు ఉప్పెనలా కదలివచ్చి, కదంతొక్కి విజయవంతం చేయడంపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 

నిరసన ర్యాలీలను విజయవంతం చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను అభినందిస్తూ.. కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. ‘సరిగ్గా ఏడాది క్రితం, జూన్‌ 4న చంద్రబాబు నాయుడు గొప్ప వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారు. కానీ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా తనను నమ్మిన ప్రజలకే ద్రోహం చేశారు. 

మోసపు హామీలు, ఆయన తప్పుడు ప్రకటనలతో ప్రజలకు వెన్నుపోటు పొడవడం ద్వారా రాష్ట్రాన్ని నిరాశ, నిస్పృహల్లోకి నెట్టారు. అందుకే జూన్‌ 4ను మనం వెన్నుపోటు దినంగా పాటించాలని పిలుపునిచ్చాం. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ర్యాలీల్లో అన్ని వర్గాల ప్రజలు ఉప్పెనలా కదలివచ్చి.. తమ వేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది కేవలం నిరసన కాదు. 

అబద్ధాలు చెప్పి మోసం చేస్తే మౌనంగా ఉండబోమంటూ శక్తివంతమైన సందేశాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఈ నిరసన ద్వారా చాటిచెప్పారు. మోసపోయిన ప్రజల బాధ, నిరాశ, ఆగ్రహం, పెల్లుబుకుతున్న వ్యతిరేకతను ఈ ర్యాలీలు ప్రతిబింబించాయి. 
 


ప్రజల హక్కులు, న్యాయం, గౌరవం కోసం వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ జనంతో కలిసి పోరాడుతూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజల తరఫున నిలదీస్తూ నిరసన ర్యాలీ­లను విజయవంతం చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు నేను హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)