Breaking News

వీడియో సహా అన్ని ఆధారాలున్నాయి.. రవీంద్ర పగటి వేషగాడు: పేర్ని నాని

Published on Mon, 07/14/2025 - 13:39

సాక్షి, తాడేపల్లి: ఏపీలో కేవలం రెడ్‌బుక్‌ పాలన మాత్రమే సాగుతోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేస్తే.. అలా చేసిన వారిని న్యాయస్థానాల్లో నిలబెడతాం అని హెచ్చరించారు. కొల్లు రవీంద్ర ఓ పగటి వేషగాడు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మహానటి అంటూ సైటెరికల్‌ కామెంట్స్‌ చేశారు.

మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో​ మాట్లాడుతూ..‘జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక కుటుంబంపై కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. ప్పాల హారికపై దాడి చేసి తిరిగి ఉప్పాల రాముపై కేసు నమోదు చేయడం దారుణందాడి చేసి తిరిగి మా పార్టీ సభ్యులపైనే కేసులు నమోదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్త ఏం చేశారో.. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. టీడీపీ మహిళా కార్యకర్తతో తప్పుడు ఫిర్యాదు చేసింది. ఆమె కొడాలి నాని.. ఫ్లెక్సీని చించేశారు. ఫ్లెక్సీని చించి చేతికి గాయం అయితే కారుతో గుద్దారని తప్పుడు ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేస్తే.. వారిని న్యాయస్థానాల్లో నిలబెడతాం.

చంద్రబాబు హయాంలోనే తప్పుడు కేసుల పరిపాలన కనపడుతోంది. నారా లోకేశ్‌ డైరెక్షన్‌తో అధికారులు తప్పుడు కేసులు పెడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకంటే సైకో ప్రభుత్వం మరొకటి లేదు. గంజాయి, మందు తాగించి అల్లర్లకు పంపింది టీడీపీ కార్యకర్తలు కాదా?. జెడ్పీ చైర్‌పర్సన్‌ మీద దాడి చేయించింది టీడీపీ వాళ్ళు కాదా?. వాళ్లే గొడవలు సృష్టించి తిరిగి కేసులు పెడుతున్నారు. 13 నెలలుగా తప్పుడు కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. వైఎస్సార్‌సీపీలో ఎవరు క్రియాశీలకంగా ఉంటే వారిపై కేసులు పెడుతున్నారు అని మండిపడ్డారు. గుడివాడలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నించింది టీడీపీ వాళ్ళు కాదా? అని ప్రశ్నించారు.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)