Breaking News

మిథున్‌రెడ్డి అరెస్ట్‌.. వైఎస్సార్‌సీపీని దెబ్బ తీసేందుకే లిక్కర్‌ కేసు

Published on Mon, 07/21/2025 - 10:19

వైయస్‌ఆర్సీపీని దెబ్బతీసి ఉద్దేశంతో లేని లిక్కర్ కేసును బనాయించారని ఆ పార్టీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి అంటున్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ప్రారంభ నేపథ్యంలో ఢిల్లీలో సాక్షి ప్రతినిధితో ఆయన మాట్లాడారు.   

సాక్షి, ఢిల్లీ: ఏపీలో అక్రమ అరెస్టుల పరంపర కొనసాగుతోందని, లేని లిక్కర్‌ కేసును బనాయించి వైయస్‌ఆర్సీపీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆ పార్టీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ప్రారంభ నేపథ్యంలో సాక్షి ప్రతినిధితో ఆయన మాట్లాడారు.   

ఏపీలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. పార్లమెంటు సమావేశాల ఉన్నప్పటికీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం దారుణం. మద్యం విధానం పై చర్చకు మేము సిద్ధం. అలాగే.. 2014-2024 వరకు మద్యం  విధానంపై కూడా చర్చించాలి. టీడీపీ హయాంలో ప్రైవేటు వ్యాపారులకు మద్యం లైసెన్స్ ఇచ్చి ఊరురా బెల్టు షాపులు పెట్టించారు. టీడీపీ హయాంలో పెద్ద సంఖ్యలో బెల్టు షాపులతో మద్యం ఏరులై పారింది. కానీ..

మా ప్రభుత్వ హాయంలో పారదర్శకంగా ప్రభుత్వమే మద్యం దుకాణాల నిర్వహించి అమ్మకాలను తగ్గించింది. వైయస్సార్సీపీని దెబ్బతీసి ఉద్దేశంతో లేని లిక్కర్ కేసును బనాయించారు అని అన్నారాయన. ఏపీలో వైఎస్ జగన్‌కు తగిన భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలోని ఖనిజ సంపదను అప్పుల కోసం తాకట్టు పెడుతున్నారు. ఈ అంశాలన్నీ పార్లమెంటులో లేవనెత్తుతా అని తెలిపారు. 

ఇక.. ఆపరేషన్  సింధూర్ తో పాకిస్తాన్‌కు కేంద్రం గట్టి బుద్ధి చెప్పిందన్న వైవీ సుబ్బారెడ్డి.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)