Breaking News

డీఎస్సీ, అమరావతిపై సీబీఐ దర్యాప్తు జరగాలి: సుబ్బారెడ్డి

Published on Fri, 06/19/2026 - 10:41

సాక్షి, ఢిల్లీ: ఏపీలో జరిగిన డీఎస్సీ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అవినీతిమయం అయిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో పనిచేసే వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరగాల్సిందే. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందోని ఆరోపించారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘డీఎస్సీ నియామకాల్లో అర్హులకు ఉద్యోగాలు అందలేదు. అర్హులైన నిరుద్యోగులకు అవకాశాలు దక్కలేదు. డీఎస్సీ పేపర్ లీక్ జరిగింది. దీనిపై సీబీఐ విచారణ జరగాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. అన్ని వ్యవస్థలు అవినీతిమయం అయిపోయాయి. డీఎస్సీ పేపర్‌ను రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు అమ్ముకున్నారు. టీడీపీలో పనిచేసే వారికి ఉద్యోగులు ఇచ్చారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల్లో టీడీపీ సానుభూతిపరులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. వేలాది మంది మెరిట్‌ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. టీడీపీ స్వప్రయోజనాలు కాపాడే రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు కేటాయిస్తున్నారు. భూముల కేటాయింపులపై కూడా సమగ్ర దర్యాప్తు జరగాలి. రెండు లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారు. ఒక్క చదరపు అడుగుకు 20,500 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 5000 రూపాయల లోపే చదరపు అడుగుకు నిర్మాణం ఖర్చు పెడుతున్నారు. ఇదే అమరావతిలో జరుగుతున్న లూటికి నిదర్శనం. ఎన్‌హెచ్‌ఏ జాతీయ రహదారుల నిర్మాణానికి కిలోమీటర్‌కు 20 కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారు. అదే అమరావతిలో 58 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇండియాలోని ప్రధాన నగరాల్లో కూడా నిర్మాణపు ఖర్చులు ఈ స్థాయిలో లేవు. ఈ అంశాలపైన సమగ్రమైన సీబీఐ దర్యాప్తు జరగాలి. ఏపీలో దారుణమైన పాలనను కేంద్ర ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్తాం’ అని తెలిపారు. 

అనంతరం, గాదె సాయికృష్ణ కేసు విషయమై వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. రాష్ట్రంలో పైశాచిక పాలన జరుగుతోంది. సీఐని సస్పెండ్ చేస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అని ప్రశ్నించారు. ఆ తల్లికి ప్రభుత్వ సమాధానం చెప్పాలి అని డిమాండ్‌ చేశారు.

వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ..‘తమిళనాడులో లాకప్ డెత్ జరిగితే పోలీసులకు జీవిత శిక్ష విధించారు. ప్రాణాలు తీసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారు?. తమిళనాడు కంటే ఘోరమైన ఘటన ఇది. ఎవరికి అన్యాయం జరిగిన వారి పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది అని స్పష్టం చేశారు. 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)