Breaking News

ఈసీ డ్రామా.. పులివెందులలో రీపోలింగ్‌ బహిష్కరిస్తున్నాం: అవినాష్‌ రెడ్డి

Published on Wed, 08/13/2025 - 08:41

సాక్షి, వైఎస్సార్‌: పులివెందులలో ఈరోజు జరుగుతున్న రీపోలింగ్‌ను వైఎ‍స్సార్‌సీపీ బహిష్కరిస్తున్నట్టు ఎంపీ అవినాష్‌ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆపరేషన్ రిగ్గింగ్‌ను చాలా గొప్పగా చేశారని మండిపడ్డారు. పులివెందులలో ఒక కొత్త సంస్కృతికి చంద్రబాబు తెరలేపారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో చాలా చోట్ల చేయవచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నిక కమిషన్‌పై ఉంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నిన్న జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఎలా జరిగాయో రాష్ట్రం మొత్తం చూశారు. ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది టీడీపీ వారు ఎలా బూత్‌లు ఆక్రమించారో అందరికీ తెలుసు. ఈరోజు తెల్లవారు జామున 2 గంటలకు కేవలం 2 బూత్‌లలో మాత్రమే రీపోలింగ్ ప్రకటించారు. మేము స్పష్టంగా 15 బూత్‌లలో రీపోలింగ్ జరగాలని, కేంద్ర బలగాలతో ఎన్నిక జరపాలని మేము కోరాం. కేవలం తప్పించుకునేందుకు రాత్రికి రాత్రి కేవలం రెండు బూత్‌లలో రీపోలింగ్ అంటున్నారు. అసలు ఏజెంట్లను కూడా బూత్‌లోకి రానివ్వలేదు. అన్ని ఆధారాలు బయటకు వచ్చాయి.

మహిళల ఓట్లను కూడా మగవాళ్లు వేసేశారు. కోర్టుకు ఆశ్రయిస్తామని ఈ రీపోలింగ్ డ్రామాను తెర మీదకు తెచ్చారా?. మా స్టాండ్ 15 బూత్‌లలో రీపోలింగ్ జరపాలి. ఈ రెండు బూత్‌లలో నేడు జరుగుతున్న రీపోలింగ్ మేము బహిష్కరిస్తున్నాం. మొత్తం 15 బూత్‌లలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. నిన్న మీడియాను కూడా అడ్డుకుని కెమెరాలు లాక్కున్నారు. గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల్ని అడిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. పులివెందులలో ఒక కొత్త సంస్కృతికి చంద్రబాబు తెరలేపారు.

ఒక గ్రామంలో ఉన్న వైఎస్సార్‌సీపీని ఎదుర్కోడానికి జిల్లాలో ఉన్న టీడీపీ కేడర్ మొత్తాన్ని గ్రామంలో దించారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో చాలా చోట్ల చేయవచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నిక కమిషన్‌పై ఉంది. నిన్న జరిగిన అరాచకాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు రీపోలింగ్ పెడుతున్నారు. అన్ని సెంటర్లలో పోలీసుల సంపూర్ణ సహకారంతో మా ఏజెంట్స్‌ను బయటకు నెట్టేశారు. 15 ఊరులో ప్రజలను అడిగితే నిజానిజాలు తెలుస్తాయి. మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను.. నిజమైన ఓటర్లను, ప్రజలను ప్రశ్నించి చూడండి. నిజాలు బయటకు వస్తాయి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)