Breaking News

చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: వరుదు కళ్యాణి

Published on Wed, 03/12/2025 - 16:07

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు మహిళల గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందంటూ వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక మహిళలను నిలువునా మోసం చేశారని నిలదీశారు. ఏ ఒక్క‌ సంక్షేమ పథకాన్నీ అమలు చేయటంలేదని దుయ్యబట్టారు.

‘‘ఉచిత బస్సు తెలంగాణలో కొనసాగుతున్నా ఏపీలో ఇంకా ప్రవేశ పెట్టలేదు. ఆడబిడ్డ నిధి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఉచిత గ్యాస్ సిలిండర్ ఒకటికే పరిమితం చేశారు. అది కూడా సగం మందికే ఇచ్చి మరో మోసం చేశారు. టీడీపీ అంటే తెలుగింటి ఆడపిల్లలను మోసం చేసే పార్టీ. 2014-19లో కూడా డ్వాక్రా మహిళలను మోసం చేశారు. జగన్ తెచ్చిన దిశ యాప్‌ని కాపీ కొట్టి.. శక్తియాప్ అని పెట్టారు. జగన్ తెచ్చిన వ్యవస్థలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు’’ అని వరుదు కల్యాణి మండిపడ్డారు.

‘‘జగన్ మహిళలకు రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థానం కల్పించారు. మహిళాభ్యుదయం జగన్ వలనే సాధ్యమైంది. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చంద్రబాబు చెప్పకుండా జగన్ గురించి విమర్శలు చేయటం బాధాకరం. చంద్రబాబు తన ఆస్తిలో చెల్లెళ్లకు ఎంత ఇచ్చారో సమాధానం చెప్పాలి. తల్లికి ఏం ఇచ్చారో చెప్పాలి. చంద్రబాబు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి వ్యక్తిగత ఆరోపణలు చేయటం సిగ్గుచేటు’’ అంటూ వరుదు కల్యాణి దుయ్యబట్టారు.

చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: వరుదు కళ్యాణి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)