Breaking News

టీడీపీ అంటే తెలుగుదేశం డర్టీ పాలన: వరుదు కళ్యాణి

Published on Tue, 01/20/2026 - 16:02

సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అంటే తెలుగుదేశం డర్టీ పాలన అని రుజువైంది అంటూ మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మహిళలు సిగ్గుతో తలదించుకునే విధంగా సంక్రాంతికి సంబరాలు జరిగాయని ఆరోపించారు. అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులను కాపలాగా పెట్టారని కూటమి సర్కార్‌పై నిప్పులు చెరిగారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘డ్వాక్రా మహిళలకు చంద్రబాబు టోకరా వేశారు. డ్వాక్రా సంఘాలను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. 16,600 కోట్ల రుణాలను బ్యాంకులు తగ్గించేశాయి. మహిళలకు సున్నా వడ్డీకి రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. మహిళలకు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వాలి. సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన 7000 కోట్లు బకాయిలు వెంటనే విడుదల చేయాలి. డ్వాక్రా మహిళలను ఏ విధంగా చంద్రబాబు మోసం చేశారో నాబార్డ్ నివేదికలు తెలియజేస్తున్నాయి. డ్వాక్రా మహిళలకు నాలుగు విడతల్లో వైఎస్‌ జగన్ రుణమాఫీ చేశారు. జగన్ హయాంలో సున్నా వడ్డీ  రుణాలు మంజూరు అయ్యేవి.  

మహిళలు సిగ్గుతో తలదించుకునే విధంగా సంక్రాంతికి సంబరాలు జరిగాయి. కూటమి పాలనలో అశ్లీల నృత్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీని మార్చారు.
కూటమి నేతలు సంక్రాంతి.. సంస్కృతి సాంప్రదాయాలను మంటగలిపారు. మహిళా హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో విచ్చలవిడిగా అశ్లీల నృత్యాలు, అర్ధనగ్న ప్రదర్శనలు జరిగాయి. రికార్డింగ్ డ్యాన్సులు, అర్ధనగ్న ప్రదర్శనలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు?. బట్టలు విప్పి రికార్డింగ్ డ్యాన్సులు చేయాలన్న వారిని ఎందుకు నడి రోడ్డుపై నడిపించలేదు?. క్యాసినోలు, పేకాటలు ఆడిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు. నడిరోడ్డుపై ఎందుకు నడిపించలేదు?. అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులను కాపలాగా పెట్టారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బట్టలు విప్పి రికార్డింగ్ డాన్సులు వెయ్యండన్న వారిని ఎందుకు నడిరోడ్డుపై నడిపించలేదు..

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)