Breaking News

సూపర్ సిక్స్ అడిగితే.. డైవర్షన్ రాజకీయాలా?: అరుణ్‌కుమార్‌

Published on Wed, 01/29/2025 - 17:15

సాక్షి, తాడేపల్లి: ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేసే ఉద్దేశమే ఆయనకు లేదని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జనాన్ని పచ్చి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు.. సూపర్ సిక్స్ అడిగితే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

‘‘ఎన్నికలకు ముందు అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పథకాల గురించి అడిగితే సంపద సృష్టి తర్వాతనే అమలు చేస్తామని అంటున్నారు. చంద్రబాబు ఆర్ధిక అరాచక వాది. కాగ్ లెక్కలను కూడా తప్పుగా మార్చి మాట్లాడుతున్నారు. చంద్రబాబు చేసిన తప్పుడు పనులను మాపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎల్లోమీడియా ఉందని ఎలా చెప్పినా జనం నమ్ముతారన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారు. 7 నెలల్లోనే లక్షా 13 వేల కోట్ల అప్పు చంద్రబాబు చేశారు. ఇన్ని అప్పులు చేసినా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదు’’ అని అరుణ్‌కుమార్‌ నిలదీశారు.

వైఎస్‌ జగన్ హయాంలో నీతి ఆయోగ్ ప్రకటించిన జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో ఏపీ ఉంది. ఇప్పుడు సూపర్ సిక్స్ గురించి అడిగితే డబ్బులు లేవంటున్నారు. చంద్రబాబు మోసగాడనీ, ఆయన్ను నమ్మవద్దని జగన్ అనేకమార్లు చెప్పారు. జగన్ మాటలతో ప్రజలు ఇప్పుడు రియలైజ్ అయ్యారు. సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి’’ అని అరుణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: ‘బాబు మోసాలను పవన్‌ ప్రశ్నించరా?’

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)