చంద్రబాబుకు మాటలెక్కువ.. పని తక్కువ: మల్లాది విష్ణు

Published on Thu, 10/31/2024 - 16:12

సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం, చంద్రబాబుకు మాటలెక్కువ.. పని తక్కువ అంటూ కామెంట్స్‌ చేశారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఇదే సమ​యంలో తిరుపతి దేవస్థానం బోర్డు లిస్టులో బ్రాహ్మణులు ఎందుకు లేరు అని ప్రశ్నించారు. చంద్రబాబుకి బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే చిన్నచూపు అంఊ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వైఎస్సార్‌సీపీ విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం, చంద్రబాబుకు మాటలెక్కువ పని తక్కువ. దేవస్ధానం బోర్డుల్లో బ్రాహ్మణులకు స్ధానం కలిపిస్తామని చెప్పారు. తిరుపతి దేవస్ధానంలో బోర్డు లిస్టులో బ్రాహ్మణులు ఎందుకు లేరు?. కేబినెట్‌ మీటింగ్‌లో, జీవోలో గొప్పలు చెప్పుకున్నారు. 2024, 2019, 2014లో ఒక్క నియోజకవర్గంలో ఒక్కరికి కూడా పోటీ చేయడానికి టికెట్ ఇవ్వలేదు.

600 మంది వేద పడింతులకు మూడు వేల చొప్పున  స్కాలర్‌షిప్ ఇస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. ఈ మేరకు తీర్మాణం చేసింది వైఎస్సార్‌సీపీనే. తీర్మానం చేయడమే కాదు.. నిధులు కూడా విడుదల చేశాం. ఇప్పుడు బ్రాహ్మణులకు చోటు లేదు కాబట్టే దాన్ని పక్కదారి పట్టించడానికి స్కాలర్‌షిప్‌ ఇస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబుకి బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే చిన్నచూపు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభలో ఎక్కడా బ్రాహ్మణులకు స్ధానం కల్పించలేదు. కేబినెట్‌లో వాళ్లు చేసిన నిర్ణయాన్ని నేడు ఉల్లఘించారు. ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. బ్రాహ్మణులకు టీటీడీలో ప్రాతినిధ్యం లేదు.హిందూ సమాజానికి, ఆధ్యాత్మిక చింతనలో బ్రాహ్మణ వర్గాన్ని గౌరవించడంలో పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వం విఫలం చెందింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)