Breaking News

‘పవన్‌.. బాబు సూపర్‌ సిక్స్‌కు గ్యారంటీ నువ్వే కదా’

Published on Fri, 01/31/2025 - 13:01

సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు వైఎ‍స్సార్‌సీపీ నేతలు. ఎనిమిది నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేనని బాబు చేతులెత్తేశాడని వ్యాఖ్యలు చేశారు. అలాగే, అప్పులు చేసి కూడా పేదలకు చంద్రబాబు పథకాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల పేరుతో మోసం చేసిన టీడీపీ నేతలు ఎక్కడికక్కడ ప్రజల నిలదీయాలని పిలుపునిచ్చారు.

అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా నేడు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బాధ్యతల స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్ సహా భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మాట ఇచ్చి మోసం చేయడం చంద్రబాబు సహజ గుణం. చెప్పింది చెయ్యడం.. చేయగలిగినదే చెప్పడం వైఎస్ జగన్ సహజ గుణం. ఎన్నికలకు ముందు ఒక్క అబద్దం చెప్పడానికి కూడా జగన్ ఒప్పుకోలేదు.. హామీల అమలు కోసం అడిగితే మొన్నే అధికారంలోకి వచ్చాం అంటున్నారు. మరి మొన్నే అధికారంలోకి వచ్చిన మీరు గ్రీన్ హైడ్రో ప్రాజెక్టు ఎలా తీసుకొచ్చారు?. బల్క్‌ డ్రగ్ పార్క్ ఎలా తీసుకొచ్చారు?. పథకాల విషయంలో మొన్నే అధికారంలోకి వచ్చాం అంటారా?. ప్రాజెక్టులు మాత్రం మేమే తీసుకొచ్చాం అంటారా?. ఇదెక్కడి న్యాయం’ అని ప్రశ్నించారు. 

కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్సీ  బొత్స సత్యనారాయణ ఈ ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ లక్కు.. అంబటి రాంబాబు అంటే వైఎస్సార్‌సీపీలో కిక్కు. చంద్రబాబు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడు. ఎనిమిది నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేనని బాబు చేతులెత్తేశాడు. మోసం చేసిన టీడీపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలి. నాకు అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులుగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు. అనకాపల్లిలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలవడంలో నా పాత్ర కీలకంగా ఉంటుందని నూకాంభిక అమ్మవారిపై ప్రమాణం చేస్తున్నాను అని అన్నారు.

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మాట్లాడుతూ.. ‘2019 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్‌లో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఫలితం రిపీట్ కావాలి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని మంచి చేసిన సీఎంగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు. రాష్ట్రంలో పోర్టులు, మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది. అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్ పార్క్ కూడా వైఎస్సార్‌సీపీ హయాంలోనే వచ్చింది.

రాష్ట్రంలో వాట్సాప్ సేవలు తీసుకొచ్చింది వైఎస్ జగన్. వాలంటీర్ వ్యవస్థ వలన ప్రజలకు మంచి జరిగింది. కానీ, పార్టీకి కేడర్‌కు మధ్య గ్యాప్ పెరిగింది. మళ్ళీ అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యకర్తల ద్వారానే అన్ని సేవలు అందుతాయి. ఇది పార్టీ మాటగా హామీ ఇస్తున్నాను. అన్ని వైఎస్‌ జగన్‌ను ప్రజలు ఓడించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రజలకు మంచిగా బుద్ధి చెబుతున్నారు. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు బటన్‌ నొక్కి డబ్బులు వేయలేకపోతున్నాడు. ప్రజలకు రెండు లక్షల 80వేల కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ఉభయ రాష్ట్రాలలో మంచి పేరున్న నాయకుడు బొత్స సత్యనారాయణ. పార్టీ ఓడినా మండలి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న వ్యక్తి బొత్స. 164 స్థానాలు ఎందుకు వచ్చాయో కూటమి నేతలకే అర్ధం కావడం లేదు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ పునఃనిర్మాణం జరుగుతుంది. ధర్మశ్రీని ఢిల్లీ పంపాలని జగన్ నిర్ణయించారు. ఓటమి నుంచే పట్టుదల పెరుగుతుంది. ఎనిమిది నెలల కాలంలో ఇంత వ్యతిరేకత మూటకట్టుకున్న ప్రభుత్వం లేదు. చంద్రబాబు సూపర్ సిక్స్‌కు పవన్ కళ్యాణ్ గ్యారంటీ ఇచ్చారు. బీజేపీ గ్యారంటీ ఇవ్వలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటానంటే ఆయన భార్య, కొడుకు ఒప్పుకునేలా లేరు. వైఎస్సార్‌సీపీ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవడానికి లోకేష్ ఒక్కడు చాలు. లోకేష్‌కు దండం పెట్టిన వాడికి మంత్రి పదవి ఇచ్చారు’ అని కామెంట్స్‌ చేశారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)