Breaking News

మోసకారి బాబు.. మళ్లీ ఫెయిల్‌: YSRCP నేతలు

Published on Tue, 01/28/2025 - 11:39

సాక్షి,వైఎస్సార్‌జిల్లా: సూపర్‌సిక్స్‌ హామీలు అమలు చేయలేనని సీఎం చంద్రబాబు చేతులత్తేయడంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం(జనవరి28) ఈ విషయమై వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు నేతలు స్పందించారు. ఎన్నికల హామీలు ఎగ్గొట్టే తన నైజాన్ని బాబు మరోసారి బయటపెట్టుకున్నారని, ఇందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపిస్తున్నారని విమర్శించారు.

కొవిడ్‌లోనూ వైఎస్‌ జగన్‌ సంక్షేమం అందించారు: వైఎస్‌ అవినాష్‌రెడ్డి 

బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటూ ప్రజలకు ఇచ్చిన హామీలో చంద్రబాబు విఫలమయ్యడని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి విమర్శించారు. ఏపీ అప్పుల్లో ఉందంటూ చంద్రబాబు ఏ పథకమూ ఇవ్వలేమని చేతులెత్తేశాడన్నారు.

‘2019లో వైఎస్‌‌ జగన్ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రానికి రూ.5లక్షల కోట్లు అప్పు ఉండేది. అప్పుడు రాష్ట్ర ఖజానాలో రూ.100 కోట్లు మాత్రమే ఉంది. రెండు సంవత్సరాలు కొవిడ్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది.

కొవిడ్‌ సమయంలో కూడా వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలను ప్రజలకు అందజేశారు.మేనిఫెస్టోను దైవంగా భావించి పథకాలను పేదలకు వైఎస్‌ జగన్‌ అందించారు.హామీల అమలులో బాబు, వైఎస్‌ జగన్‌లకు చాలా తేడా ఉంది’అని అవినాష్‌రెడ్డి అన్నారు. 

ఇచ్చిన మాట తప్పడం బాబు నైజం:  కాటసాని రాంభూపాల్ రెడ్డి 

  • టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారంలో తల్లులకు 15 వేలు, పిల్లలకు 15 వేలు అంటూ వారు ప్రచారం చేసి మోసం చేశారు
  • టీడీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు కూడా ప్రజలను మోసం చేశారు
  • సంక్షేమ పథకాలు అమలు చేయకుంటే చొక్కా పట్టుకోమని చెప్పిన నేతలు ఇప్పుడు ఎక్కడున్నారు
  • చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వంలో అందరికి సంక్షేమ పథకాలు అందించారు
  • ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్రం అప్పుల పాలయ్యిందని బాబు చెప్పుకొస్తున్నారు
  • 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన రాష్ట్రానికి ఏమి చెయ్యడం లేదు
  • రాష్ట్రంలో క్వాలిటీ చదువు కన్న క్వాలిటీ మద్యాన్ని చంద్రబాబు అందిస్తున్నారు
  • చంద్రబాబు సూపర్ సిక్స్, రాష్ట్రంలో డూపర్ సిక్స్ అయింది, టీడీపీ నేతలు కూడా ఎవరు సూపర్ సిక్స్ పై మాట్లడం లేదు
  • తెలుగు దేశం పార్టీ నేతలు ఎమ్మెల్యేలు సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పడం లేదు

బాబు, పవన్‌ సమాధానం చెప్పాలి: పోతిన మహేష్‌ 

  • సూపర్ సిక్స్ అమలు సాధ్యం కాదని,ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేమని బాబు  చేతులెత్తేశారు
  • ఇది ప్రజలను మోసం చేయడం కదా అని చంద్రబాబు ,పవన్ చెప్పాలి..
  • సూపర్ సిక్స్ అమలు చేయించే బాధ్యత నాదని పవన్ చెప్పాడు..ఇప్పుడు పవన్ స్పందించాలి
  • చంద్రబాబు పాలన సంక్షేమ పధకాల కోత..పన్నుల మోత గా ఉంది..
  • రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు చేపడుతున్నాడు. హెల్మెట్ లేకపోతే వెయ్యి నూట ముప్పై ఐదు రూపాయలు కట్టించుకొంటున్నారు..
  • విద్యుత్ చార్జీల పెంపు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు, చాలనాలు వసూళ్లు చేయడం సంపద సృష్టించడం అంటారా?
  • వైఎస్‌ జగన్ దగ్గర చంద్రబాబు , పవన్ ట్యూషన్‌ చెప్పించుకోవాలి..
  • వైఎస్‌ జగన్ సంక్షేమ పథకాల అమలులో సెంచరీ కొడితే... పవన, చంద్రబాబు డక్ ఔట్ అయ్యారు..
  • బీజేపీ చంద్రబాబు పవన్ పట్టుకున్న మ్యానిఫెస్టో పట్టుకోలేదు..
  • ప్రజలు చంద్రబాబు, పవన్ మాయలో పడ్డారు..
  • దావోస్ లో చంద్రబాబు ని చూసి పారిశ్రామిక వ్యక్తలు పారిపోయారు..ఒక్క ఎంవోయూ కూడా చేసుకోలేదు..
  • తెలంగాణ ముఖ్యమంత్రి లక్ష 78వేల కోట్లు ఎంవోయూలు చేసుకొని పండగ చేసుకుంటున్నారు..
  • 40ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ని చూసి పారిశ్రామిక వేత్తలు ఎందుకు రాలేదు..
  • పవన్ దావోస్ పెట్టుబడులపై మాట్లాడాలి.. ఇది ప్రభుత్వ వైఫల్యం కదా?
  • కర్నూల్ గ్రీన్ కో అత్భుతంగా వుందని చెప్పిన కంపెనీ జగన్ హయాంలో వొచ్చింది..
  • దావోస్ పర్యటన తరువాత చంద్రబాబు నాలిక మడతపడుతుంది..
  • వినేవాళ్ళు ఉంటే చంద్రబాబు చార్మినార్ కట్టారని చెపుతారు.
  • 2014 నుండి 2019 వరకు టీడీపీ ఒక్క పని కూడా చేయలేదు.. ఒక్క శాశ్వత నిర్ణయం కూడా చెప్పట్టలేదు..
  • అమరావతి కి ఔటర్ రింగ్ రోడ్ కట్టింది.. విజయవాడ వెస్ట్ బైపాస్ కట్టింది.. అమరావతి లో తిరుపతి తరహా గుడి కట్టింది వైఎస్‌ జగన్ 
  • సింగపూర్ కంపెనీకి అమరావతి నిర్ణయం గురించి మాట్లాడారు
  • అమరావతి లో రిజిస్ట్రేషన్ చార్జీలు లేవని చంద్రబాబు చెపుతున్నారు..పేద మధ్యతరగతి వాళ్ళు సెంటు భూమి కొనగలరా?
  • పేదలు కొనే దగ్గర రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి.. పెట్టుబడి దారులు కొనే దగ్గర చార్జీలు తగ్గుతాయి.
  • పేదల ఇంట్లో , మహిళల కళ్లల్లో వెలుగులు వైఎస్‌ జగన్ హయాంలోనే జరిగింది..
  • చంద్రబాబు చెప్పినట్లు కేంద్రం నిధులు దారి మళ్ళితే పోలవరం పని పూర్తి అవుతుందా?
  • ఏ పని చేయలేక.. ఏ పని చేతకాక గుడ్డ కాల్చి వైఎస్‌ జగన్ పై వేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు..
  • ఉద్దానం సమస్య కు శాశ్వత పరిష్కరం చూపిన నేత వైఎస్‌ జగన్
  • ప్రాంతం చూడలేదు.. జగన్ సమస్య ను మాత్రమే చూసారు..

చంద్రబాబు ప్రకటనలో మోసం,వంచన:మల్లాది విష్ణు

  • చంద్రబాబు ప్రకటనలో మోసం ,దగా , వంచన స్పష్టంగా కనిపిస్తున్నాయి
  • రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 2019 ఎన్నికల్లో మోసం చేశావ్
  • 2024 ఎన్నికల్లో ఏపీ శ్రీలంక అయిపోయిందని తప్పుడు ప్రచారం చేశారు
  • సూపర్ సిక్స్ ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు గొంతు చించుకున్నారు
  • జగన్ మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలిస్తామని చెప్పారు
  • కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల జీవన స్థితిగతులను పట్టించుకోలేదు
  • గద్దెనెక్కిన దగ్గర్నుంచి వైఎస్‌ జగన్ పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు
  • జీడీపీ 15 శాతం కంటే ఎక్కువ ఉంటేనే సంక్షేమం ఇస్తామంటున్నారు  
  • పథకాలివ్వాలంటే ఎనిమిది తొమ్మిదేళ్లు పడుతుందంటున్నారు
  • మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఎన్నికల ముందు తెలియదా ఏపీ ఆర్ధిక పరిస్థితి
  • మా పథకాన్ని కాపీకొట్టి తల్లికి వందనం 15 వేలు ఇస్తామన్నారు..చేతులెత్తేశారు
  • 54 లక్షల మంది రైతన్నలను మోసం చేశారు
  • 18 వేలు ఇస్తామని కోటి 80 లక్షల మంది మహిళలను మోసం చేశారు
  • కోటి మంది నిరుద్యోగులను దగా చేశారు
  • బటన్ నొక్కడానికి జగన్ ఎందుకు ముసలమ్మ సరిపోతుందన్నారు
  • అమరావతి పేరుమీద వేల కోట్లు అప్పులు చేయడానికి మీరే కావాలా
  • పోలవరానికి కేంద్రం ఇచ్చే నిధులు ఖర్చు చేయడానికి మీ కూటమి అవసరమా
  • ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి
  • జగన్ హయాంలో ఏపీలో పేదరికం 11.5 నుంచి 6శాతంకు తగ్గిందని నీతి ఆయోగ్ చెప్పింది
  • నీతి ఆయోగ్ గణాంకాలకు ఏం సమాధానం చెబుతావ్ చంద్రబాబు  
  • ఈ ఏడు నెలల్లో తెచ్చిన లక్ష కోట్లకు పైగా అప్పు సొమ్మును ఏంచేశారో సమాధానం చెప్పాలి
     

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)