Breaking News

పాలక పార్టీ తీరు బాధాకరం.. ఇంత నిర్లక్ష్యం తగదు: బొత్స

Published on Thu, 08/22/2024 - 12:36

విశాఖపట్నం, సాక్షి: ‘‘ఒక్కరోజులో మా బతుకులు తలకిందులైపోయాయి. మా వాళ్ల శవాల్ని తెచ్చి ఇక్కడ పెట్టారు. ప్రమాదం జరిగాక.. మా లోకల్‌ ఎమ్మెల్యే, ఎంపీ ఎవరూ వచ్చింది లేదు. ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్‌ నుంచి స్పందన లేదు’’ అంటూ అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీ బాధిత కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి.

గురువారం వైఎస్సార్‌సీపీ నేతలు కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఆ సమయంలో బాధిత కుటుంబాల ఆవేదన విని.. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చలించిపోయారు. ‘‘అచ్యుతాపురం ఘటన దురదృష్టకరం.  కానీ, పాలక పార్టీ తీరు బాధాకరం. బాధితుల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఇంత నిర్లక్ష్యం తగదు. బాధితులకు భరోసా కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఘటనకు బాధ్యులు అయిన యాజమాన్యం మీద చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.  

.. సీఎం చంద్రబాబు కేజీహెచ్‌కు ఎందుకు రాలేదు?. మా పార్టీ డిమాండ్‌ను ఇప్పటికే అధినేత వైఎస్‌జగన్‌ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. మా ప్రభుత్వం ఎల్జీ పాలీమర్స్‌ ఘటనలో కోటి రూపాయల పరిహారం ఇచ్చింది. కానీ, ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఎన్ని కోట్లు ఇచ్చినా.. పోయిన ప్రాణం తిరిగి రాదు. కానీ, బాధిత కుటుంబాలకు పరిహారంతోనే ఆదుకోవాలి. మృతుల కుటుంబాల్ని ప్రభుత్వం పరామర్శించకపోవడం మంచి సంప్రదాయం కాదు. రేపు బాధితుల్ని వైఎస్‌ జగన్‌ పరామర్శిస్తారు’’ అని బొత్స తెలిపారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)