Breaking News

‘అక్రమ కట్టడం.. అధికారిక నివాసమా?.. ఇది సబబేనా బాబూ?’

Published on Thu, 01/02/2025 - 15:00

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అధికారిక నివాసం అక్రమ కట్టడమని.. నదీ పరీవాహకంలో ఎలాంటి నివాసాలు ఏర్పాటు చేయకూడదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మరి చట్టాలు తయారు చేసేవారే అక్రమ నివాసాల్లో ఉండటం సబబేనా? అంటూ ప్రశ్నించారు.

‘‘అక్రమ నివాసాన్ని అధికారిక నివాసంగా ఎలా నిర్ణయిస్తారు?. 2014లోనే ఇది అక్రమ కట్టడం అని అధికారికంగానే తేల్చారు. రాష్ట్ర విభజన అనంతరం కొత్త ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వంలోని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇది అక్రమ కట్టడం అని చెప్పారు. దీన్ని కూల్చాలంటూ ప్రకటన కూడా చేశారు. మేథాపాట్కర్, రాజేంద్రసింగ్ వంటి పర్యావరణ వేత్తలు ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారు’’ అని శివశంకర్‌ గుర్తు చేశారు.

‘‘నదీ పరివాహక చట్టం ప్రకారం వంద మీటర్ల లోపు ఎలాంటి కట్డడాలు చేయకూడదు. కానీ చంద్రబాబు నివాసం నదీ పరివాహకంలోనే ఉంది. లోకాయుక్త సైతం 2015లో ఈ అక్రమ కట్టడాలను తొలగించాలని ఆదేశించింది. అయినాసరే ఆ అక్రమ నివాసాన్ని కూల్చకుండా చంద్రబాబు నివాసం ఉంటున్నారు. ఇటీవల వచ్చిన వరదలతో చంద్రబాబు ఇల్లు ఖాళీ చేసి విజయవాడ కలెక్టరేట్‌లో తల దాచుకున్నారు. ఈ అక్రమ కట్టడాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు బుడమేరు వరదని విజయవాడ మీదకు తిప్పారు’’ అని శివశంకర్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బాబుకది షరా మామూలే!

‘‘ఆ ఇంటిని ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుందని.. ఓనరు లింగమనేని రమేష్ ప్రకటించారు. కానీ చంద్రబాబు మాత్రం అసెంబ్లీలో ఆ బిల్డింగ్‌కి అద్దె కడుతున్నానని చెప్పారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో అబద్దం చెప్పారు. చంద్రబాబు నివాసం అక్రమ కట్టడమే’’ అని పుత్తా శివశంకర్ దుయ్యబట్టారు.

 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)