Breaking News

చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు: పుత్తా శివశంకర్‌

Published on Sun, 12/07/2025 - 16:49

సాక్షి, తాడేపల్లి: దేవుడంటే భయం లేదు.. ప్రజలంటే బాధ్యత లేని వ్యక్తి చంద్రబాబు.. వెంకటేశ్వర స్వామిని సైతం తన వికృత రాజకీయాల్లోకి లాగారు’’ అంటూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పరకామణి కేసులో రవికుమార్‌ని మా హయాంలోనే పట్టుకున్నాం. దాదాపు 30 ఏళ్లుగా చోరీలు చేస్తున్నా చంద్రబాబు హయాంలో పట్టుకోలేదు’’ అని శివశంకర్‌ పేర్కొన్నారు.

‘‘రవికుమార్ ప్రాయశ్చిత్తం చెంది తన ఆస్తిని టీటీడీ కి రాసిచ్చారు. క్లోజ్ అయిన ఆ కేసును మళ్ళీ తిరగతోడి చంద్రబాబు క్షుద్ర రాజకీయాలకు దిగారు. రవికుమారే స్వయంగా ఒక వీడియో చేసి తన బాధను వెలిబుచ్చారు. ప్రాయశ్చిత్తం చెందిన వ్యక్తిని మళ్ళీ మళ్ళీ వేధించటం సబబేనా?. హిందూ మతాన్ని ఏమాత్రం లెక్కచేయని వ్యక్తి చంద్రబాబు. విజయవాడలో 40 ఆలయాలను కూల్చిన వ్యక్తి చంద్రబాబు. టీటీడీ ఆస్తులను కాజేయాలని చంద్రబాబు చూశారు. హథీరాంజీ మఠం ఆస్తులని కూడా చంద్రబాబు తన బినామీలకు రాయించారు. గోదావరి పుష్కరాల సమయంలో తన ప్రచార పిచ్చి కోసం 29 మంది చనిపోవడానికి కారణమయ్యారు’’ అని శివశంకర్‌ మండిపడ్డారు.

‘‘రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం తల నరికిన కేసులో A2గా ఉన్న సూరిబాబుకి చంద్రబాబు రూ.5 లక్షలు ఇచ్చారు. తిరుమలలో ఉన్న వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చిన వ్యక్తి చంద్రబాబు. ఆరోజు సాధువులు, మఠాధిపతులు దేశ వ్యాప్తంగా ఆందోళన చేశారు. హిందూ మతం అంటే భయం, భక్తి ఉంటే చంద్రబాబు ఇలా చేసేవారా?. జేఈవోగా సుబ్రహ్మణ్యాన్ని 9 ఏళ్లపాటు ఎందుకు కొనసాగించారో అందరికీ తెలుసు. సదావర్తి సత్రం భూములను కొట్టేయటానికి చేసిన ప్రయత్నాలు దేశమంతా తెలుసు. అనేక భూములను చంద్రబాబు తన మనుషులకు కట్టబెట్టలేదా?. కాశిరెడ్డినాయన సత్రాన్ని కూల్చేశారు. సింహాచలం ఆలయ భూములు రికార్డుల్లో  లేకుండా ఎలా పోయాయి?

..విజయవాడ దుర్గమ్మ ఆలయంలో బంగారు ఆభరణాలు దొంగిలించిందీ చంద్రబాబు హయాంలోనే. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కోట్లాది హిందువుల మనో భావాలను దెబ్బ తీశారు. పరకామణి కేసులో రవికుమార్ ఎలా ప్రాయశ్చిత్త పడ్డారో చంద్రబాబు కూడా అలా ప్రాయశ్చిత్తం పడితే మంచిది. అంతేగానీ దుర్మార్గపు రాజకీయాలు చేయవద్దని కోరుకుంటున్నాం’’ అని  శివశంకర్‌ హితవు పలికారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)