Breaking News

‘కేసులను ఎదుర్కోలేని పిరికిపంద చంద్రబాబు’

Published on Fri, 12/12/2025 - 14:51

సాక్షి, తాడేపల్లి: కేసులను ఎదుర్కోలేని పిరికిపంద చంద్రబాబు అంటూ వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి మండిపడ్డారు. అధికారులను బెదిరించి తన మీద కేసులను క్లోజ్ చేయించుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసులు క్లోజ్‌పై తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన మీద ఉన్న కేసులను క్లోజ్ చేసుకోవటం సరికాదని గౌతమ్‌రెడ్డి అన్నారు.

‘‘చంద్రబాబు వ్యవహారం దొంగే.. దొంగా దొంగా అన్నట్టుగా ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్‌ను కూడా ఉల్లంఘించారు. ఫైబర్ నెట్ కేసును ఇప్పుడు క్లోజ్ చేయించుకున్నారు. సీఐడీ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతోంది. అవినీతి చేసినట్టు ఆధారాలు ఉన్నా సీఐడీ ఎందుకు కేసును వదిలేసింది?. జగన్ హయాంలో పూర్తయిన కేసులను కూడా రీఓపెన్ చేశారు. చంద్రబాబే స్వయంగా సంతకాలు చేసి దొరికిన కేసులను మాత్రం క్లోజ్ చేశారు’’ అంటూ గౌతమ్‌రెడ్డి నిలదీశారు.

‘‘ఫైబర్ నెట్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు. వేమూరి హరిప్రసాద్ కోసం చంద్రబాబు నిబంధనలను తుంగలో తొక్కారు. వందల కోట్లు కైంకర్యం చేయటానికి చంద్రబాబు నాటకాలు ఆడారు. చంద్రబాబు నేరాల మీద నేరాలు చేశారు. ఆర్థిక అరాచకం చేసిన చంద్రబాబు తన మీద‌ ఉన్న కేసులను ఎలా క్లోజ్ చేస్తారు?. దీనిపై మేము ప్రొటెక్షన్ పిటిషన్‌ని హైకోర్టులో వేస్తాం. బ్లాక్‌ లిస్టులో ఉన్న మనిషిని పిలిచి అందలం ఎక్కించారా లేదా?’’ అంటూ గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు.

ఈవీఎంల విషయంలో వేమూరి హరిప్రసాద్‌కు కోర్టు శిక్ష వేసింది. అలాంటి వ్యక్తిని ఫైబర్‌ నెట్‌లోకి ఎలా తెచ్చారు?. 105 రకాల నాసిరకం వస్తువులు కొని అవినీతికి పాల్పడ్డారా? లేదా?. వేమూరి హరిప్రసాద్‌ని డైరెక్టర్‌గా తీసుకోవాలని‌ సీఎంవో నుండి లెటర్ ఇవ్వలేదా?. రూ.114 కోట్ల విలువైన అవకతవకలు ఫైబర్ నెట్‌లో జరిగాయా? లేదా?. ఇలాంటి విషయాలపై విచారణ జరుగుతుండగా కేసును ఎందుకు క్లోజ్ చేశారు?. కేసులను ఎదుర్కోవడం చేతకాని పిరికిపంద చంద్రబాబు. ఈ కేసులను క్లోజ్ చేయటానికి హైకోర్టు, సుప్రీంకోర్టు అంగీకరించవు. దీనిపై మరింతగా న్యాయ పోరాటం చేస్తాం’’ అని గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.

సీఐడీ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతోంది :గౌతమ్ రెడ్డి

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)