Breaking News

అందుకే ‘తిరుమల లడ్డూ’పై బాబు నీచ రాజకీయం: పోతిన మహేష్‌

Published on Fri, 09/20/2024 - 15:09

సాక్షి, విజయవాడ: వందరోజుల్లో చేసింది చెప్పుకోలేక తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్‌ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుకు మంచి బుద్దిని ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు. పరిపాలన గాలికొదిలేసి, ఇస్తామన్న పథకాలు ఇవ్వకుండా తన చేతకానితనం బయటపడినప్పడు వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

‘‘వంద రోజుల్లో అమలు చేస్తామన్న పథకాల గురించి ప్రజలు అడుగుతారని శ్రీవారి ప్రసాదంపై చంద్రబాబు విమర్శలు చేశాడు. జూలైలో రిపోర్టులో వస్తే సెప్టెంబర్‌లో బయటపెట్టడం ఏంటీ?. శాంపిల్స్ ఎప్పుడివి? ఎక్కడ సేకరించారు. రిపోర్టు ఎప్పుడు ఇచ్చారు? ఇలాంటి ప్రశ్నలు భక్తుల్లో ఉన్నాయి. నాణ్యత లేకపోతే  నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపించామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. లడ్డూ ప్రసాదంలో నాణ్యత ప్రమాణాలు తగ్గకూడదని గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 550 దేశీ ఆవులతో గోశాల ఏర్పాటు చేసింది కూడా గత ప్రభుత్వమే..ఇది కనిపించడం లేదా?’’ అంటూ పోతిన మహేష్‌ దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూపై CBN ఉన్మాద రాజకీయం

‘‘శ్రీవైష్ణువులు తేడా జరిగితే చెప్పారా? ఎందుకు ఊరుకుంటారు?. లడ్డు సరుకులను ముందుగానే తనిఖి చేస్తారు.. సరిగ్గా లేకుంటే తిరిగి పంపిస్తారు. లడ్డూ తయారికి ముందే సరుకులు తనిఖి చేస్తారు. లడ్డు తయారీ తర్వాత తనిఖీ చేయడం సాధ్యం కాదు. ఏ కాలానికి వచ్చింది.. ఎప్పుడు వచ్చింది. ఏ ట్యాంక్‌లో వచ్చింది చెప్పకుండా కోట్లాది హిందూ భక్తుల మనోభావాలతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. వెంకన్న భక్తులు చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వానికి జవాబు ఇస్తారు. భక్తుల మనోభావాలు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప రాజకీయంగా వాడుకోవాలని చూడడం సరైనది కాదు’’ అని పోతిన మహేష్‌ హితవు పలికారు.

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)