Breaking News

మా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు: నందిగం సురేష్‌ సతీమణి

Published on Tue, 01/14/2025 - 16:06

సాక్షి,గుంటూరు:మాజీ ఎంపీ నందిగం సురేష్‌ ఎదుగుదల ఇష్టం లేకనే ఆయనపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని సురేష్‌ సతీమణి బేబి లత ఆరోపించారు. ఈ విషయమై ఆమె మంగళవారం(జనవరి14) మీడియాతో మాట్లాడారు. ‘అర్ధరాత్రి మా ఇంటి చుట్టూ ఇద్దరు వ్యక్తులు బైక్‌పై తిరిగారు. ఒక వ్యక్తి బైక్ నడుపుతుంటే మరొక వ్యక్తి మా ఇంటి ఫోటోలు తీస్తున్నారు.

దీనిపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. నందిగం సురేష్ అనుచరులపై అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి వేధిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి నా భర్తను 134 రోజులు జైల్లో ఉంచారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలేయాల్సిన కేసుల్లో కూడా బెయిల్ రానివ్వకుండా అడ్డుకుంటున్నారు’అని బేబి లత ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు గతంలో జైలులో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. జిల్లా జైలులో ఉన్న ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో జైలు అధికారులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. వైద్యులు నందిగం సురేష్..లో-బీపీతో పాటు భుజం నొప్పితో బాధపడుతున్నట్లు గుర్తించారు.  

సురేష్‌కు ఒక కేసులో బెయిల్‌ వస్తే మరో కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీంతో ఆయన సుదీర్ఘ కాలం పాటు జైలులోనే ఉండాల్సి వస్తోందని ఆయన భార్య బేబిలత పలు సందర్భాల్లో వాపోయారు. సురేష్‌ బెయిల్‌ విషయమై సుప్రీం కోర్టులో కూడా ఆమె పిటిషన్‌ వేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఏపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. 

ఇదీ చదవండి: కహానీలు చెబితే కడుపు నిండుతుందా..?

 

 

 

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)