Breaking News

అందుకే షర్మిలను ప్రజలు నమ్మలేదు: భూమన

Published on Sun, 10/27/2024 - 14:01

సాక్షి, తిరుపతి: వైఎస్‌ జగన్‌లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారని.. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సర్వం వదులుకున్న వ్యక్తి అని వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్‌ అధిస్టానాన్ని సైతం వైఎస్‌ జగన్‌ ధిక్కరించారు. కుట్రతో తప్పుడు కేసులు పెట్టినా ఆయన వీరుడిలా పోరాడారన్నారు.

‘‘వైఎస్‌ జగన్‌పై షర్మిల అన్యాయంగా మాట్లాడుతున్నారు. జగన్‌ అనే వ్యక్తి ఒక యుద్ధ వీరుడు. అందుకే పార్టీ ఓడిపోయినా కోట్లాది మంది జగన్‌ వెంటే ఉన్నారు. వైఎస్సార్‌ ఆశయాలను నెరవేర్చే వ్యక్తి జగన్‌ మాత్రమే. అందుకే ఆయనను ప్రజలు నమ్మారు.  తెలంగాణ మెట్టినిల్లు అంటూ షర్మిల అక్కడ రాజకీయాలు చేశారు. మళ్లీ చాపచుట్టేసి తిరిగి ఏపీకి వచ్చారు.. చంద్రబాబుకు నేరుగా మద్దతు పలుకుతున్నారు. షర్మిలను తెలంగాణ, ఏపీ ప్రజలు నమ్మలేదు. చంద్రబాబుతో కలసి సొంత అన్నపైనే షర్మిల కుట్ర చేస్తున్నారు. మీ లాంటి చెల్లి వైఎస్‌ జగన్‌కు ఉండటం బాధగా ఉంది. వైఎస్‌ జగన్‌ చిన్న తప్పు కూడా చేయలేదు.’’ అని భూమన చెప్పారు.

‘‘షర్మిల రాసిన లేఖలు టీడీపీ వెబ్‌సైట్‌లలో ఎలా వస్తున్నాయి?. చంద్రబాబుతో కలిసి అన్నపై కుట్ర చేయడం మీకు తగునా?. కేవలం రెండున్నర ఎకరాల చంద్రబాబు లక్షల కోట్లు సంపాదించారు.. అందులో తమ్ముడి, సోదరీమణులకు ఎంత ఆస్తి పంచి ఇచ్చారు.’’ అంటూ భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు.

 

 

 

 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)