Breaking News

రైతుల తరపున పోరాడతాం: భూమన

Published on Tue, 12/10/2024 - 19:40

సాక్షి,తిరుపతి:కూటమి ప్రభుత్వం రైతులకు పెద్ద ఎత్తున సహాయం చేస్తామని చెప్పి మోసం చేసిందని, చంద్రబాబు మొదటి నుంచి రైతు వ్యతిరేకి అని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు.‘అన్నదాతకు అండగా’ పేరుతో ఈ నెల 13 నుంచి వైఎస్సార్‌సీపీ చేపట్టనున్న నిరసన కార్యక్రమాల పోస్టర్‌ను భూమన మంగళవారం(డిసెంబర్‌10) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

‘ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయం చేస్తామని,వరికి మద్దతు ధర ఇస్తామని  చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి 6 నెలలయినా రైతులను పట్టించుకోక పోవడం దారుణం.20 ఏళ్ల క్రితమే చంద్రబాబు రైతు వ్యతిరేకి, ఉచిత కరెంటు ఇస్తామని ఆనాడు వైఎస్సార్‌ చెబితే హేళన చేసిన వ్యక్తి చంద్రబాబు.రూ.86 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని 2014లో మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. 

రైతుల పక్షాన  పోరాటం చేస్తాం. ఈనెల 13న తిరుపతి జిల్లా కలెక్టరేట్‌ ముందు నేతలు ఆర్కే రోజా, అభినయ్,మోహిత్,రాజేష్,మధుసుధన్‌రెడ్డితో కలిసి నేను నిరసనలో పాల్గొంటా. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట పూతలపట్టు పార్టీ ఇన్‌ఛార్జ్‌ డాక్టర్ సునీల్,విజయానందారెడ్డి కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాం. విద్యుత్ చార్జీలు పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 27న నిరసన కార్యక్రమాలు చేపడతాం. డిస్కంల ఎదుట ఆందోళన చేస్తాం’అని భూమన తెలిపారు. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)