Breaking News

కాపులపై చంద్రబాబుకు ఎందుకంత కోపం?: అంబటి

Published on Tue, 06/03/2025 - 16:41

సాక్షి, తాడేపల్లి: కాపులపై చంద్రబాబుకు ఎందుకంత కోపం? అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కోర్టు కొట్టేసిన కేసును మళ్లీ తిరగతోడితే కాపు సమాజం తరపున ఒక కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. కాపులను బీసీల్లోకి చేర్చుతానని 2014 ఎన్నికలకి ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేశారు. ఆయన పిలుపుతో అన్ని రాజకీయ పార్టీల్లోని కాపులు మద్దతు తెలిపారని అంబటి రాంబాబు వివరించారు.

‘‘తుని సభ సమయంలో రైలు తగులపడితే కాపులే నిప్పు పెట్టారని కేసులు పెట్టారు. ముద్రగడ కుటుంబ సభ్యులు మీద దాడి చేసి, ఆయన్ని నిర్బంధించారు. అప్పుడు నేను, దాసరి నారాయణరావు, చిరంజీవి, రామచంద్రయ్య తదితరులంతా హైదరాబాదులో సమావేశం అయ్యాం. ముద్రగడ పద్మనాభం ఒంటిరి కాదు. ఆయన వెనుక మా కాపుజాతి అంతా ఉంది. కాపు ఉద్యమ కారుల మీద పెట్టిన కేసులను జగన్ తొలగించారు. కోర్టు సైతం కేసులను కొట్టేసింది. అలాంటి కేసులను తిరగదోడటం వెనుక చంద్రబాబుకు దురుద్దేశం ఉంది’’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.

‘‘దీనిపై మేమంతా సమావేశం నిర్వహించి ఒక కార్యాచరణను రూపొందిస్తాం. చంద్రబాబు, హోంమంత్రికి తెలియకుండా జీవో వచ్చిందా?. అలా వచ్చి ఉంటే వారంత అసమర్థులు మరెవరు ఉండరు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు. తనది డేగ కన్ను అని చెప్పుకున్న చంద్రబాబుకు తెలియకుండానే జీవో వచ్చిందా?. చంద్రబాబుది డేగ కన్ను కాదు, గుడ్డికన్ను. తన ప్రభుత్వంపై తానే విచారణ జరిపించుకోవటం చంద్రబాబుకు సిగ్గుచేటు. కాపు సమాజానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు.

 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)