Breaking News

బాబు తేనె పూసిన కత్తికి వాలంటీర్లు బలి: వైఎస్సార్‌సీపీ

Published on Mon, 08/05/2024 - 15:03

సాక్షి, తాడేపల్లి: అధికారంలోకి వచ్చేందుకు ఎన్ని అబద్దాలు చెప్పడానికైనా వెనుకాడని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మరోసారి నిరూపితమైంది. అధికారం కోసం అలవి కాని హామీలు ఇచ్చి ఇప్పుడు తీర్చలేక ప్రజలను మోసం చేస్తున్నాడు. మరోవైపు.. ఎన్నికలకు ముందు వాలంటీర్లపై కపట ప్రేమ చూపించి అధికారంలోకి వచ్చాక.. వారిని నట్టేట ముంచేశాడు. దీంతో వారంతా దిక్కులేని స్థితిలో రోడ్డున పడ్డారని వాలంటీర్ల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. 

కాగా, వాలంటీర్లకు జరిగిన అన్యాయంపై వైఎస్సార్‌సీపీ స్పందించింది. తాజాగా వైఎస్సార్‌సీపీ ఎక్స్‌ వేదికగా.. సీఎం చంద్రబాబు మొదటి నుంచీ వాలంటీర్లపై అక్కస్సు వెళ్లగక్కుతూనే ఉన్నారు. కానీ, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఎలక్షన్స్ ముందు కపట హామీలతో వాలంటీర్లను మభ్యపెట్టాడు. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాలంటీర్లను నట్టేట ముంచేశాడు. వాలంటీర్‌ వ్యవస్థ నిర్వీర్యంపై క్లారిటీ ఇస్తూ.. వారి గ్రూపులన్నింటినీ డిలీజ్‌ చేయాలని అధికారులను చంద్రబాబు ఆదివారం ఆదేశించారు. చంద్రబాబు తేనే పూసిన కత్తికి బలైపోయి లక్షలాది మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారు అని పేర్కొంది.

ఇక, ఎన్నికల సమయంలో వాలంటీర్లపై చంద్రబాబు ఎంతో కపట ప్రేమను చూపించారు. తాము అధికారంలోకి వస్తే.. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించి.. వారికి జీతం రెట్టింపు చేస్తామన్నారు. వాలంటీర్ల జీతం రూ.10వేలు ఇస్తానని దొంగ హామీ ఇచ్చారు. కానీ, గెలిచాక మాత్రం చేతులెత్తేశారు. 

 

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)