మంత్రి అచ్చెన్నాయుడుకు కాకాణి సవాల్‌

Published on Sat, 11/01/2025 - 11:51

సాక్షి, నెల్లూరు: మంత్రి అచ్చెన్నాయుడుకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని సవాల్‌ చేశారు. అలాగే, రైతుల సమస్యలపై చర్చించేందుకు చంద్రబాబు, అచ్చెన్నాయుడు సిద్ధమా? అని ప్రశ్నించారు.

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్‌సీపీ హయాంలో ఆర్‌బీకే వ్యవస్థ ద్వారా రైతులకు వైఎస్‌ జగన్‌ అండగా నిలిచారు. వైఎస్‌ జగన్‌ తెచ్చిన వ్యవస్థలను చంద్రబాబు కుట్రపూరితంగా నిర్వీర్యం చేశారు. చంద్రబాబు మాటలను నమ్మ ప్రజలు, రైతులు మోసపోయారు. కూటమి నేతల తీరు చూసి ప్రజలు ఛీకొడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం. అసెంబ్లీ సాక్షిగా కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులే విమర్శలు చేసుకుంటున్నారు. రైతులు సమస్యలపై చర్చించేందుకు చంద్రబాబు, అచ్చెన్నాయుడు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు.

కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఏపీలోని బెల్టు షాపుల్లో 90 శాతం నకిలీ మద్యమే. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో బెల్టు షాపులను ఎత్తేశాం. ప్రజల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కలేదు. మద్యం బాటిళ్లపై క్యూఆర్‌ కోడ్‌ ఎక్కడుంది?. ఎక్సైజ్‌ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రజల ఆరోగ్యంతో సంబంధం లేకుండా దోచుకుంటున్నారు’ అని ఘాటు విమర్శలు చేశారు.

 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)