Breaking News

అది దాడి కాదు.. నన్ను చంపాలనే ప్లాన్‌: జోగి రమేష్‌

Published on Mon, 02/02/2026 - 15:00

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: మంత్రి నారా లోకేష్‌ ఆదేశాలతోనే తన ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు మాజీ మంత్రి జోగి రమేష్‌. తనపై ఎటువంటి దాడి జరిగినా లోకేష్‌దే బాధ్యత అని చెప్పుకొచ్చారు. తన ఇంటిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై దాడే అని అన్నారు. తనను మట్టుబెట్టాలనే ఆలోచనే లేకపోతే దాడి ఎందుకు చేస్తారు? అని ప్రశ్నించారు. 83 రోజులు జైలులో పెట్టినా కడుపు చల్లబడలేదా చంద్రబాబు అని మండిపడ్డారు.

తన ఇంటిపై టీడీపీ నేతల దాడి అనంతరం మాజీ మంత్రి జోగి రమేష్‌ స్పందించారు. ఈ సందర్భంగా జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రేరేపిత కుట్రతోనే మా ఇంటిపై దాడి చేశారు. తప్పుడు కేసులో అకారణంగా నన్ను, నా తమ్ముడిని 83 రోజులు జైలులో పెట్టారు. మమ్మల్ని వేధించి, హింసించి రక్షసానందం పొందుతున్నారా?. ప్రజా వ్యతిరేక విధానాలపై నా గొంతుక వినిపించడం తప్పా?. మీరు బూతులు మాట్లాడితే తప్పు లేదు కానీ.. మేం ప్రశ్నిస్తే తప్పా?. మా ఇంటిపై జరిగిన దాడి బడుగు బలహీన వర్గాలపై జరిగిన దాడి అని ఘాటు విమర్శలు చేశారు.

ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలోనే గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌ దాడికి దిగింది. నన్ను, నాకుటుంబాన్ని నాశనం చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారా?. మీ బుర్రలు పాడు కాకపోతే మా ఇంటిపైకి దాడులు చేయిస్తారా?. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి మరీ గూండాలను రప్పించారు. మంత్రి నారా లోకేష్‌ ఆదేశాలతో ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలోనే మా ఇంటిపై దాడి చేశారు. పోలీసు అధికారులు, టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే మా ఇంటిపై కుట్ర జరిగింది. టీడీపీ గూండాలకు పోలీసులే రక్షణ ఇచ్చారు. పోలీసుల చేతుల్లో కనీసం లాఠీలు కూడా లేవు. పోలీసుల సమక్షంలోనే.. పోలీసుల సాక్షిగా మా ఇంటిపై దాడి జరిగింది. 

Jogi Ramesh: నన్ను చంపాలనే ప్లాన్‌

కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే శిక్షిస్తారు. లోకేష్‌ నీ రెడ్‌బుక్‌ తీసి మడిచిపెట్టుకో. నాపై ఎటువంటి దాడి జరిగినా లోకేష్‌దే బాధ్యత. నేను నిన్న మాట్లాడినందుకు మళ్లీ నాపై కేసులు పెట్టారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలవలేదని సెంట్రల్‌ ల్యాబ్‌లే నిర్ధారించాయి. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని అన్నారు. నాకు అండగా జగనన్న, వైఎస్సార్‌సీపీ సైన్యం ఉంది. ఏడాదిన్నర కాలంలోనే ప్రభుత్వం అసమర్ధత బయటపడింది. జోగి రమేష్ ఎక్కడికీ పారిపోడు.. ఇక్కడే ఉంటాడు. విద్యార్ధి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నా. తప్పుడు కేసులకు, అరెస్టులకు భయపడేది లేదు. నా ఇల్లు తగలబెట్టి లోకేష్ దగ్గర మార్కులు కొట్టేద్దామని కొంతమంది సంబరపడుతున్నారు. గుర్తుంచుకోండి.. ఎవరినీ విడిచిపెట్టేది లేదు. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో.. నీ ఇంటికి నా ఇల్లు కూడా అంతేదూరమని లోకేష్ గుర్తుంచుకోవాలి’ అని హెచ్చరించారు. 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)