Breaking News

‘బాబు చీటర్‌, లోకేష్‌ లూటర్‌ అని ప్రజలే మాట్లాడుకుంటున్నారు’

Published on Mon, 10/06/2025 - 12:35

సాక్షి, విశాఖ: చంద్రబాబు(Chandrababu) అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడతారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌(Gudiwada Amarnath) మండిపడ్డారు. కానీ, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ మాత్రం ఎప్పుడూ ఒకే మాట మాట్లాడుతారని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్(Vizag Steel Plant) ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ వ్యతిరేకమే అని మరోసారి అమర్నాథ్‌ క్లారిటీ ఇచ్చారు.

ఈనెల తొమ్మిదిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) విశాఖ పర్యటనపై నేడు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మాట్లాడుతూ..‘ఏడు నియోజకవర్గాల మీదుగా వైఎస్‌ జగన్‌ రోడ్ షోగా వెళ్ళే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్, షుగర్ ఫ్యాక్టరీ, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు వైఎస్‌ జగన్‌ కలవనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ వ్యతిరేకమే. కేంద్రం చేస్తున్న ఆలోచనలు తెలిసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలి.

చంద్రబాబులా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట జగన్ మాట్లాడరు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్టీల్ ప్లాంట్‌లో దాదాపు పదివేల మంది ఉద్యోగాలు పోయాయి. కూటమి ప్రభుత్వం పేదవారి కడుపు కొడుతోంది. పేదవాడికి ఉచిత వైద్యం అందడం ఈ కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేకనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. చంద్రబాబు చీటర్, లోకేష్(Nara Lokesh) లూటర్ అని జనం మాట్లాడుకుంటున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

ఇది కూడా చదవండి: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ఎవరికి లాభం?

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు